మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలకు సంతకం చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఆయన పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తాజాగా దసరా సందర్భంగా రవితేజ తన 69వ సినిమాను ప్రకటించారు. ఈ మేరకు దసరా రోజున ‘రవితేజ69’ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ధమాకా’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. రవితేజ కొత్త ప్రాజెక్ట్ కు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్టోబర్ 4న షూటింగ్ మొదలై, వచ్చే ఏడాదికి ఈ సినిమా విడుదలవుతుంది.
Read Also : కన్నడ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్ నెక్స్ట్
ఇక ‘ధమాకా’ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ కు భీమ్స్ సంగీతం సమకూరుస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు రవితేజ ‘ఖిలాడీ’ చిత్రీకరణ పూర్తయింది. త్వరలో సినిమా విడుదలలు సిద్ధం అవుతోంది. రవితేజ మరో చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది విడుదల అవుతుంది. 2022 ద్వితీయార్ధంలో ‘ధమాకా’ థియేట్రికల్ విడుదలతో ప్రేక్షకులను అలరించనుంది.
