Site icon NTV Telugu

Rudrangi: మీరా బాయిగా విమలా రామన్! బర్త్ డే పోస్టర్ విడుదల!

Vimala

Vimala

Vimala Raman:’రుద్రంగి’ సినిమాలోని ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది చిత్ర బృందం. ఈ సినిమాను తెలంగాణ శాసనసభ్యుడు, కవి, గాయకుడు, రాజకీయనేత ‘రసమయి’ బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ”బాహుబలి, ఆర్. ఆర్.ఆర్.” చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Read Also: Kanti Velugu : ‘కంటి వెలుగు’తో ప్రపంచ రికార్డు సాధించాలి: సీఎస్ శాంతికుమారి

‘రుద్రంగి’ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన కీలక పాత్రల పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. జగపతి బాబు, మమతా మోహన్ దాస్, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్ పోస్టర్స్ ఇంతవరకూ విడుదల అయ్యాయి. తాజాగా జనవరి 23వ తేదీ నటి విమలారామన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ‘రుద్రంగి’లో పోషించిన మీరాబాయి లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే… ఉన్నతవంశానికి చెందిన యువతిలా ఆమె కనిపిస్తోంది. భారీ నిర్మాణ హంగులతో తెరకెక్కిస్తున్న ‘రుద్రంగి’ టాలీవుడ్ లో మరో విజువల్ వండర్ గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, నాఫల్ రాజా ఏఐఎస్ స్వర రచన చేస్తున్నారు.

Exit mobile version