Hansika: భారతీయ సినిమాల్లో అందానికీ, అభినయానికి గుర్తొచ్చే పేర్లలో హన్సిక మోత్వానీ ఒకటి. గత యేడాది డిసెంబర్ 4న తన స్నేహితుడు సోహెల్ ఖటూరియాని ఆమె పెళ్ళాడింది. జైపూర్ లో ముందోట ఫోర్ట్ అండ్ పాలస్ లో ఆమె పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పటికే పలు చిత్రాలలో నటించి చక్కటి పేరు, గుర్తింపు తెచ్చుకున్న హన్సిక వివాహానంతరం మొట్టమొదటి సారిగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘హన్సికాస్ లవ్ షాదీ డ్రామా’ పేరుతోస్పెషల్ షో ఒకటి చేయబోతోంది.
హన్సిక తన పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడం దగ్గరనుంచి, కేవలం ఆరువారాల్లో అద్భుతంగా పెళ్లి జరగడానికి కష్టపడ్డ వెడ్డింగ్ ప్లానెర్స్, డిజైనర్లు, కుటుంబ సభ్యులు కాలానికి ఎదురీది ఎంత కష్టపడ్డారో, ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారో అన్నీ నిజంగా అద్భుతమైన కథలా రాబోతున్నాయి. హన్సిక పెళ్లి సంతోషాన్ని ఆవిరి చేసే ప్రయత్నంలో పెళ్ళికి ముందు వినిపించిన ఒక స్కాండల్ గురించి హన్సిక, తన కుటుంబ సభ్యులు కూడా ఇందులో మాట్లాడబోతున్నారు. హన్సిక తో కలిసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ ‘హోస్ట్ స్టార్ స్పెషల్ షో’ గురించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. దీని స్ట్రీమింగ్ ఎప్పుడనేది త్వరలో ప్రకటించనున్నారు. మొత్తానికీ అందాల భామ హన్సికా మోత్వాని తన ప్రేమ, పెళ్ళిని కూడా ఓ డ్రామాగా మిక్స్ చేసి వ్యూవర్స్ కు అందించబోతోంది!
