Site icon NTV Telugu

భయపెడుతున్న ‘స్టూవర్ట్ పురం దొంగ’.. బెల్లంకొండ తగ్గేదేలే

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మాస్ డైరెక్టర్ వివి వినాయక్ సహచరుడు కెఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్టూవర్ట్ పురం దొంగ’. బయోపిక్ అఫ్ టైగర్ అనేది ట్యాగ్ లైన్. 1970 లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన సాహసోపేతమైన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రం కరోనా కారణంగా కొద్దిగా వెనక్కి తగ్గింది. ఇకపోతే ఇటీవల ఈ బయోపిక్ లో రవితేజ నటిస్తున్నాడని, ‘టైగర్ నాగేశ్వరరావు’ పేరుతో పోస్టర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాను వదిలేసినట్లు ప్రచారాలు జరిగాయి.

ఇక వీటన్నింటికి చెక్ పెడుతూ దీపావళి కానుకగా ‘స్టూవర్ట్ పురం దొంగ’ కొత్త పోస్టర్ తో దిగిపోయాడు. క్రూరమైన దొంగగా బెల్లంకొండ శ్రీనివాస్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. రెండు రైఫిల్స్ ని చేతపట్టి, భయంకరమైన చూపుతో చూడగానే ఎదుటివారిని భయపెట్టేలా ఉన్నాడు. ఇక ఈ పోస్టర్ తో ‘స్టూవర్ట్ పురం దొంగ’ వెనక్కి తగ్గేదిలేదని నిరూపించాడు. దీంతో అందరికి ఒక క్లారిటీ వచ్చింది. టైగర్ బయోపిక్ ని బెల్లంకొండ శ్రీనివాస్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఈ యంగ్ హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.

Exit mobile version