NTV Telugu Site icon

Balakrishna: బాలయ్య బర్త్ డే.. ఏపీలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ప్రారంభం!

Nandamuribalakrishna

Nandamuribalakrishna

First Anna Canteen Re Opened at Hindupur Balakrishna Birthday: నరసింహ నందమూరి బాలకృష్ణ ఈరోజు తన 64వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఈ మధ్య హిందూపురం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకపక్క సినిమాలతో మరొకపక్క రాజకీయాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణకు ఆయన అభిమానులు మాత్రమే కాదు సినీ రంగానికి చెందిన వారు రాజకీయ రంగానికి చెందిన వారు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో ఎక్కువగా హైదరాబాదులో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉండే వారు కానీ ఈ సారి మాత్రం ఆసక్తికరంగా తాను పోటీ చేసి గెలిచిన హిందూపురంలోనే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.

Kalki 2898 AD Trailer : గూజ్ బంప్స్ తెప్పిస్తున్న కల్కి ట్రైలర్.. చూశారా?

హిందూపురంలో నందమూరి బాలకృష్ణ తన 64వ పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ ను పున ప్రారంభించారు. గతంలో 2014వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. 2019లో ఎన్నికలకు కొద్ది నెలలు ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అయితే పలు కారణాలతో 2019 ఎన్నికల్లో గెలిచిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని కొనసాగించలేకపోయింది అయితే తాము మళ్లీ అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్ పున ప్రారంభిస్తామని ప్రకటించిన కూటమి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మొదటి అన్న క్యాంటీన్ ని పున ప్రారంభించినట్లయింది.