NTV Telugu Site icon

Fire Accident: టాలీవుడ్‌కి షాక్.. షూట్‌కి ముందు స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం!

Fire Accident

Fire Accident

Fire breaks out at DRR Studio Rajarhat: అదేంటి టాలీవుడ్ అంటున్నారు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టూడియోకి ఏమైనా అయింది అనుకుంటే పొరపాటే. అగ్ని ప్రమాదం జరిగింది ఇక్కడ కాదు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో. నిజానికి బెంగాల్ సినీ పరిశ్రమను కూడా టాలీవుడ్ అనే అంటారు. ముందుగా వారి వాడకంలో ఉన్న పేరునే మన వాళ్ళు అరువు తెచ్చుకున్నారు. అసలు విషయం ఏమిటంటే కోల్‌కతారాజర్‌హట్‌లో ఉన్న ప్రముఖ సినిమా షూటింగ్ స్టూడియోలో అగ్నిప్రమాదం జరిగింది. రాజర్‌హట్‌లో ఉన్న DRR స్టూడియోను చాలా మంది ప్రజలు “రాంబాబు గార్డెన్” అని పిలుస్తారు. బెంగాల్‌లోని అన్ని ప్రముఖ రియాలిటీ షోలు ఈ స్టూడియోలో షూట్ చేస్తారు. “దాదాగిరి” మొదలు “దీదీ నంబర్ వన్”, “సరిగమప” వంటి షోలు ఇక్కడ షూట్ చేస్తారు.

Faria Abdullah: యెల్లో శారీలో అదరగొడుతున్న చిట్టి.. నెటిజన్స్ ఫిదా..

అయితే ఉదయం 11:30 గంటల ప్రాంతంలో రెండు మేకప్ వ్యాన్‌లకు మంటలు అంటుకున్నాయి. క్యాంటీన్ నుంచి మేకప్ వ్యాన్ వరకు మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వ్యానిటీ వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. “సరిగమప లెజెండ్స్” షో షూటింగ్ సోమవారం జరగాల్సి ఉండగా మూడు ఫైర్ ఇంజిన్లు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. “సరిగమప లెజెండ్స్” జీ బంగ్లాలో ప్రసారమయ్యే కొత్త షో. నటుడు అనిర్బన్ భట్టాచార్య ఆధ్వర్యంలో ఈ షో నడుస్తోంది. కొన్ని రోజుల క్రితం, గాయకుడు జావేద్ అలీ ఈ షోలో ఒక పాట పాడటానికి వచ్చాడు. అభిజిత్, ఆకృతి కక్కర్, వినోద్ రాథోడ్ సోమవారం షూటింగ్‌కి వెళ్లనున్నారు. అంతకు ముందే మంటలు చెలరేగడంతో కార్యక్రమాన్ని నిలిపివేశారు.

Show comments