Site icon NTV Telugu

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌పై ముంబైలో కేసు న‌మోదు

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్ కాపీరైట్స్ కేసులో ఇరుక్కుపోయారు.. ఆయ‌న‌పై కేసు కూడా న‌మోదైంది.. ‘ఏక్‌ హసీనా థీ ఏక్‌ దివానా థా’ అనే సినిమాను త‌మ అనుమ‌తి లేకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారంటూ కోర్టు మెట్లెక్కారు మేక‌ర్స్.. విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు.. సుంద‌ర్ పిచాయ్‌తో పాటు ఐదుగురు కంపెనీ ప్ర‌తినిధుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల్సిందిగా ముంబై పోలీసుల‌ను ఆదేశించింది.. ఇక‌, కోర్టు ఆదేశాల ప్ర‌కారం.. ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు పోలీసులు..

Read Also: ఏపీలో జోరుచూపిస్తున్న కోవిడ్.. ఈ రోజు ఎన్ని కేసులంటే..?

అయితే, తన సినిమా హక్కుల్ని ఎవరికీ అమ్మలేదంటూ కోర్టుకు వెళ్లిన మేక‌ర్స్.. త‌మ అనుమ‌తి లేకుండానే యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా తనకు నష్టం వాటిల్లిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.. ఈ వ్య‌వ‌హారంలో యూట్యూబ్‌కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, అందుకే తాను ఈ చర్యకు దిగానని అంటున్నారు.. కాగా, ఏక్‌ హసీనా థీ ఏక్‌ దివానా థా మూవీలో.. 2017లో విడుద‌ల చేశారు.. ఇది పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కానీ, మేక‌ర్స్ ఇప్పుడు కోర్టుకు ఎక్క‌డం.. కేసులు న‌మోదు కావ‌డం చ‌ర్చ‌గా మారింది..

Exit mobile version