Site icon NTV Telugu

Bappi Lahiri : కొడుకు రాకకై ఎదురు చూపులు… అంత్యక్రియలు ఎప్పుడంటే ?

bappi lahiri

భారతీయ సంగీత చరిత్రలో ఇదొక బ్లాక్ డే. డిస్కో రాజా బప్పి లహిరి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పలు ఆరోగ్య సమస్యలతో బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 69 ఏళ్ళ ఈ సంగీత దిగ్గజం మృతికి భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు ఆయన అభిమానులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే బప్పి లహిరి అంత్యక్రియలు ఈరోజు జరగడం లేదట. తాజా సమాచారం ప్రకారం ఆయన కుమారుడు విదేశాల నుంచి వచ్చాక అంత్యక్రియలు జరుగుతాయి.

Read Also : RC 15 : లీక్ రాయుళ్లకు మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్

భారతదేశంలో డిస్కో సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన బప్పి లహిరి అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. లాస్ ఏంజెల్స్ నుండి ఆయన కుమారుడు బప్పా లాహిరి వచ్చాక రేపు ముంబైలో ఆయన అంతిమ కార్యక్రమాలు జరగనున్నాయి. 1952న నవంబర్ 27 పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన బప్పి లహిరి దాదాపు 500కు పైగా సినిమాల్లో 5000 పాటలకు సంగీతం అందించారు. ఆయన మృతి సంగీత ప్రియులను శోకంలో ముంచేసింది.

Exit mobile version