NTV Telugu Site icon

RGV : విచారణకు హాజరైన సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ..

Rgv

Rgv

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై గతేడాది ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఆయిన సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ ఎక్స్ ఖాతాలో వ్యూహం సినిమా పోస్టర్లు పోస్ట్‌ చేసి చంద్రబాబు, పవన్‌, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేసారు. అప్పట్లో విచారణకు రావాల్సిందిగా రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు ప్రకాశం జిల్లా పోలీసులు. కానీ కొన్ని నెలలుగా విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టాడు రామ్ గోపాల్ వర్మ.

Also Read : Thandel : మొదటి సారి నీ దర్శనం అవుతుంది సామి : అక్కినేని శోభిత

కాగా నేడు ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా గతంలో ముందస్తు బెయిల్ తెచుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో నేడు పోలీసుల ముంగిట హాజరయ్యాడు. రామ్ గోపాల్ వర్మ విచారణకు వస్తున్న నేపథ్యంలో మద్దిపాడు మండలం వెల్లంపల్లి వద్ద వైసీపీ మర్యాద పూర్వకంగా కలిసారు. రామ్ గోపాల్ వర్మను కలిసిన వారిలో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. అలాగే ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయం వద్దకు వైసీపీ శ్రేణులు చేరుకొని రామ్ గోపాల్ వర్మను కలిసారు. రామ్ గోపాల్ వర్మ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్ట్ లు పెట్టడంపై ఎవరి ప్రాయమేమైనా ఉందా అని ఆరా తీయనున్నారు పోలీసులు