Site icon NTV Telugu

Film Chamber : ముగిసిన ఫిలిం ఛాంబర్‌ సమావేశం.. ఎటూ తేల్చని నిర్మాత మండలి

Film Chamber Meeting

Film Chamber Meeting

తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సమ్మె సెగ తగిలింది.టాలీవుడ్ కు చెందిన 24 కార్మిక సంఘాలు తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ షూటింగ్స్ ను బంద్ చేయాలని నిర్ణయించాయి. రోజు వేతనాలను కనీసం 30 శాతం మేర పెంచాలని కోరుతూ ఫిలిం ఛాంబర్‌తో చర్చలు జరిపారు. అయితే, ఈ చర్చలు అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవడంతో నిరసనగా షూటింగ్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ బంద్ సినిమా షూటింగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం దాదాపు అన్ని షూటింగులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై నేడు మరోసారి ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో ఫిలిం ఛాంబర్ సభ్యులు సమావేశం అయ్యారు. అనేక వాదోప వాదనలు అనతరం ఎటు తేలకుండానే ఈ సమావేశం ముగిసింది..

Also Read : B-Unique Crew : ‘పుష్ప’ సాంగ్‌తో అమెరికా స్టేజ్‌ కంపించేశాడు ‘బీ యూనిక్‌ క్రూ’..

నిర్మాతల మండలి మాత్రం 30 శాతం వేతనాల పెంపుపై తుది నిర్ణయం తీసుకోలేదు. వేతనాల పెంపుకు నిర్మాతలు ఇప్పట్లో ముందుకు రాలేకపోతున్నారు. దీనిపై లేబర్ కమిషన్ జోక్యం చేయగా, కమిషన్‌ పరిధిలో ఉన్న విషయంపై ముందస్తుగా బంద్‌కు పిలుపు ఇవ్వడంపై ఫిలిం ఛాంబర్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఉదయం నుంచి చర్చలు కొనసాగగా, సరైన పరిష్కారం కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఫెడరేషన్‌ నేతలు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు బంధుపై స్పష్టత కోసం సాయంత్రం నాలుగు గంటలకు లేబర్ కమీషనర్‌ను కలవనున్నారు. ఆ తర్వాత పరిస్థితులపై తేలిన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

 

Exit mobile version