NTV Telugu Site icon

Film Chamber: సినీ పరిశ్రమకు రేవంత్ రెడ్డి కండిషన్స్.. ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన!

Film Chamber

Film Chamber

Film Chamber Crucial Announcement on Revanth Reddy Conditions: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు తాజాగా కీలక సూచనలు చేశారు. పోలీస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన వాహన శ్రేణి ప్రారంభోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి కొన్ని కండిషన్స్ పెడుతున్నట్లు ప్రకటించారు. సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై సినిమాల్లో అవగాహన కల్పించాలన్న ఆయన వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్ , డ్రగ్స్ పై సినిమాకు ముందు డిస్క్లెయిమర్స్ ప్రదర్శించాలని పేర్కొన్నారు. సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు, కానీ వీటి పై అవగాహన కల్పించడం లేదు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ట ఎవరైతే టికెట్ రేట్లు పెంచాలని కోరుతూ ప్రభుత్వం వద్దకు వస్తారో వారి నుంచి ఆ సినిమాలో నటించిన స్టార్ల చేత డ్రగ్స్ అవగాహన వీడియో చేయించి రిలీజ్ చేయించాలని అప్పుడే రేటు పెంచుకునే అవకాశం కల్పించేలా ఒక ప్రీ కండిషన్ పెడుతున్నట్టు ఆయన ప్రకటించారు.

Darshan Case: దర్శన్‌కి సుమలత మద్దతు.. హత్య చేసింది అతను కాదు.. సంచలన పోస్ట్!

డ్రగ్స్, సైబర్ నేరాలు పై సినిమా కు ముందు కానీ సినిమా తరువాత అయిన 3 నిమిషాలు వీడియోతో అవగాహాన కల్పించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలా కల్పించకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తి లేదన్న రేవంత్ రెడ్డి అలాంటి నిర్మాతలకు , డైరెక్టర్ లకు , తారాగణంకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవన్నారు. ఇక తాజాగా ఈ అంశం మీద ఫిలిం ఛాంబర్ స్పందించింది. రేవంత్ రెడ్డిని తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రతినిధులు ఇటీవల కలిసినప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయాలపై సానుకూలంగా స్పందించారని అన్నారు.

సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణ పై సినీ రంగ ప్రముఖులు, సినిమా థియేటర్ యాజమాన్యాలు తమవంతుగా భాగం పంచుకోవాలని అన్నారని, లోగడ ఇటువంటి విషయాలలో చలన చిత్ర పరిశ్రమ ముందుండి ప్రభుత్వానికి అండగా ఉందని తెలియజేయుచున్నామని అన్నారు. ఈ విషయం పై చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు మరియు థియేటర్స్ యాజమాన్యాలు డ్రగ్స్ మరియు సైబర్ నేరాలను అరికట్టడానికి తమవంతు భాధ్యత నిర్వర్తించడానికి ఇకపైన కూడా ఎల్లవేళలా తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటారని ప్రకటించారు. దీనిపై అతి త్వరలో ముఖ్యమంత్రిని కలవగలమని అంటూ అధ్యక్షుడు దిల్ రాజు సహా కార్యదర్శులు కె. ఎల్. దామోదర్ ప్రసాద్, కె. శివప్రసాద రావుల పేరుతో ఒక లేఖను రిలీజ్ చేశారు.

Show comments