NTV Telugu Site icon

Matka : 20 ఏళ్ల తర్వాత కూడా మట్కానే ప్రస్తావిస్తారు.

Karun

Karun

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘మట్కా’ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కరుణ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Q : మట్కా కథకి ఆద్యం ఎక్కడ పడింది ?
A – మట్కా కథకి ఆద్యం ఒక ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్ లో పడింది. మా అత్తగారిది వైజాగ్. ఓ మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఈ మట్కా గేమ్ గురించి విన్నాను. ఆ మాటల సందర్భంలో వైజాగ్ లో నైట్ క్లబ్బులు, క్యాబరీలు ఉండేవని తెలుసుకున్నాను. వైజాగ్ వన్ టౌన్ గురించి, అక్కడ కల్చర్ తెలుసుకున్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అక్కడి నుంచి అసలు ఈ గేమ్ ఎవరిది అనేది పరిశోధించడం మొదలుపెట్టాను. ఒక కథకుడిగా దీన్ని ‘వాడిపోయిన పువ్వులు’ పేరుతో ఒక షార్ట్ స్టోరీ గా రాయాలనుకున్నాను. కానీ రాస్తున్నప్పుడు ఇది సినిమా మెటీరియల్ అని అర్థమైంది.

Q :  మట్కా కథని చాలా పెద్ద కాన్వాస్ లో చైల్డ్ వుడ్ నుంచి చెప్పడానికి కారణం ?
A –  ఇది ఒక మనిషి లైఫ్ జర్నీ. వాసు బర్మా నుంచి వైజాగ్ కి ఒక శరణార్థిగా వస్తాడు. వైజాగ్ లో ఉన్న పెద్ద పెద్ద పవర్ఫుల్ పర్సన్స్ అంతా బయట నుంచి వచ్చిన వాళ్లే. అప్పటి వైజాగ్ వెనుక ఉన్న క్రైమ్, గ్లామర్, కాస్మోపాలిటన్ కల్చర్ ఇవన్నీ కథలో భాగమే.

Q :  వాసు క్యారెక్టర్ లో వరుణ్ తేజ్ గారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు?
A – ఇప్పుడే సినిమాని లాక్ చేసుకుని వచ్చాను. ఇది వరుణ్ తేజ్  వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పెర్ఫార్మెన్స్. 20 ఏళ్ల తర్వాత కూడా మట్కానే ప్రస్తావిస్తారు. వరుణ్ గారు చాలా కూల్ పర్శన్. చాలా డెడికేషన్ తో వర్క్ చేశారు.

Q : మట్కా కోసం రతన్ ఖత్రి జీవితాన్ని ఎంతలా తీసుకున్నారు?
A – ఆయన కథని ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ గా తీరుస్తున్నారు. అది వెబ్ సిరిస్ గానే తీయాలి. సినిమాకి వర్కౌట్ అవ్వదు. ఇందులో ఒకటే సిమిలారిటీ ఏంటంటే.. రతన్ ఖత్రి పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చారు. ఇందులో వాసు బర్మా నుంచి వైజాగ్ వస్తాడు. అంత

Q : మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి?
A – మూడున్నాయి. అందులో ఏది ముందుగా సెట్స్ వెళుతుందో తర్వలోనే తెలుస్తుంది.

Also Read : Megastar Chiru : సత్యదేవ్ లాంటి వెర్సటైల్ యాక్టర్స్ తెలుగులో కరువైపోయారు.