అనతి కాలంలోనే తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ లీల. టాలీవుడ్‌లో సంపాదించుకున్న క్రేజ్ తోనే కోలీవుడ్, బాలీవుడ్‌లో కూడా ఈ బ్యూటీ అవకాశాలు అందుకుంటోంది. ప్రజంట్ బాలీవుడ్‌లో కార్తిక్ ఆర్యన్ తో కలిసి ‘ఆషికి 3’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో శ్రీ లీల నటిస్తోంది. అలాగే తమిళంలో శివ కార్తికేయన్‌కు జోడిగా ‘పరాశక్తి’ అనే మూవీకి సైన్ చేసింది. అలాగే తెలుగులో మాస్ మహారాజా రవితేజతో నటించిన ‘మాస్ జాతర’ విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో నటిస్తోంది. అయితే బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల మోజులో పడి శ్రీ లీల తెలుగు చిత్రాలకు సరిగ్గా డేట్స్ ఇవ్వడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా టాక్ నడుస్తోంది.
Also Read : Dil Raju : దిల్ రాజుతో నా పెళ్లి అంత ఈజీగా అవ్వలేదు.. అసలు నిజాలు బయటపెట్టిన తేజస్వినీ
అయితే మొదటి నుంచి శ్రీ లీల తల్లి చాటు బిడ్డ. స్క్రిప్ట్ సెలక్షన్ నుంచి డేట్స్ అడ్జస్ట్మెంట్ వరకు శ్రీ లీలకు సంబంధించిన అన్ని విషయాలు ఆమె తల్లి దగ్గరుండి చూసుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా తల్లినే తెలుగు సినిమాలను కాదని బాలీవుడ్ వైపు కుమార్తెను నడిపిస్తున్నట్టు టాలీవుడ్ నిర్మాతల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే తల్లి మాటలు విని శ్రీలీల పెద్ద తప్పు చేస్తుందనే చెప్పుకోవచ్చు. తెలుగు చిత్రాలను కాలదన్ని బాలీవుడ్ ను ఏలేయాలని వెళ్లిన హీరోన్లంతా బొక్కబోర్లా పడ్డారు. ఇదే మిస్టేక్ శ్రీలీల కూడా చేస్తే కెరీర్ సర్వనాశనమే అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
