Jathara : ఆ అమ్మవారి గురించి తీసిన చిత్రమే ‘జాతర’ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్‌గా, ఇంటెన్స్ డ్రామాతో ‘జాతర’ తెరకెక్కింది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే జాతర నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 8న థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను తన ఇంటర్వ్యూలో తెలిపారు హీరో, దర్శకుడు సతీష్ బాబు రాటకొండ. దేవుడు మనుషులను బొమ్మలుగా చేసి జగన్నాటకం ఆడిస్తాడని మన పురాణాల్లో చెబుతుంటారు. ఇందుకు భిన్నంగా ఒక మనిషి దేవుడిని పితలాటకం ఆడిస్తుంటాడు. ఆ పితలాటకం నుంచి అమ్మవారిని హీరో ఎలా రక్షిస్తాడు అనేది ఈ చిత్ర మూల కథాంశం. మనిషి రాక్షసుడై అమ్మవారిని చెరపడితే మరో నరుడు హరుడై ఆ రాక్షసుడిని ఎలా సంహరించాడు అనేది మా ‘జాతర’ చిత్రంలో చూపిస్తున్నాం. వాస్తవ ఘటనల ఆధారంగా ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించాను.
ఈ చిత్రాన్ని డాక్యుమెంటరీగా తీస్తే వివాదాలు వస్తాయి. సినిమా అయితే క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొందించవచ్చు అనిపించింది. 2016లో నేను ‘జాతర’ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. ప్రొడ్యూసర్ గారు నేను అనుకోకుండా ఒక ఫంక్షన్ లో మీట్ అయ్యాం. అక్కడ మా ఐడియాస్ షేర్ చేసుకున్నాం. నేను చెప్పిన పాయింట్ ఆయనకు నచ్చి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ తోనూ డిస్కస్ చేశారు. వాళ్లు కూడా బాగుందని అనడంతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది. నన్నే డైరెక్షన్ చేయమని ప్రొడ్యూసర్ గారు సజెస్ట్ చేశారు. మా ప్రొడ్యూసర్స్ రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి సినిమా చేయడంలో ఎంతో సపోర్ట్ అందించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర గ్రామాల్లో ఈ అమ్మవారి గుడి ఉంటుంది. చుట్టుపక్కల 18 ఊళ్ల ప్రజలు ఈ గుడికి వచ్చి అమ్మవారిని కొలుస్తారు. ఏడాదిన్నర పాటు ఆ ప్రాంతంలో ప్రజలతో ఇంటరాక్ట్ అయి, రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ చేసుకున్నాం. గంగమ్మతల్లిని తెలుగు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆ అమ్మవారి గురించి తీసిన చిత్రమే ‘జాతర’ అని అన్నారు.
Also Read
- Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం... 'రామాయణం' వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
- Mowgli : రోషన్ కనకాల కోసం బరిలోకి జూనియర్ ఎన్టీఆర్
- Srinidhi Shetty: రాగ పాత్రతో మరో ఫేస్ చూపించబోతోంది శ్రీనిధి.. ‘తెలుసు కదా’పై ఆసక్తికర కామెంట్స్!
- Saif Ali Khan : నాపై దాడి కొందరికి నాటకమైంది.. అసహనం వ్యక్తం చేసిన సైఫ్
- Tags
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..