Site icon NTV Telugu

Fighter: సంక్రాంతి రోజున ఫైటర్ ట్రైలర్…

Fighter

Fighter

ఇండియన్ ఫిల్మ్ హల్క్… గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో దీపికా హీరోయిన్ గా నటిస్తుండగా అనిల్ కపూర్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. హ్యూజ్ బడ్జట్ తో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ఫైటర్ సినిమా… ఇండియాలోనే మొదటి ఏరియల్ డ్రామాగా రూపొందింది. ఎయిర్ ఫోర్స్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ తో ఫైటర్ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ లోనే షాట్స్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. టీజర్ ని మించి గూస్ బంప్స్ ఇవ్వడానికి ట్రైలర్ రెడీ అవుతోంది. ఫైటర్ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ని సాలిడ్ బేస్ రెడీ చేస్తూ బజ్ జనరేట్ చేయడానికి ఫైటర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అవుతోంది.

రెడీ టు డ్రాప్ అంటూ ఫైటర్ ట్రైలర్ అనౌన్స్మెంట్ ని మేకర్స్ రివీల్ చేసారు. జనవరి 15న మధ్యాహ్నం 12 గంటలకి ఫైటర్ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ బయటకి వస్తే ఫైటర్ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత పెరగనున్నాయి. ట్రైలర్ కట్ అదిరిపోతే హ్రితిక్ రోషన్ ఖాతాలో సాలిడ్ హిట్ పడడం పక్కా… ఇక ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న హ్రితిక్ రోషన్, ఫైటర్ నుంచి ఫ్రీ అవ్వగానే వార్ 2 సెట్స్ లో జాయిన్ అవ్వనున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్స్ లో వార్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న వార్ 2 మూవీలో ఎన్టీఆర్ తో యుద్ధం చేయనున్నాడు హ్రితిక్ రోషన్. ఈ కాంబినేషన్ ఇండియా మొత్తం హాట్ టాపిక్ అయ్యింది.

Exit mobile version