NTV Telugu Site icon

Police Vari Hecharika: శరవేగంగా “పోలీస్ వారి హెచ్చరిక” షూట్

Police Vari Hecharika

Police Vari Hecharika

Fight Sequence shoot of movie Police Vari Hecharika: అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్””పోలీస్ వారి హెచ్చరిక”” అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పుడు కొన్ని ఫైట్ సీక్వెన్స్ లు షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా నటుడు రవి కాలె, అజయ్ ఘోష్, సంజయ్ నాయర్, అఖిల్ సన్నీ లతో పాటు హీరో హీరోయిన్ ల బృందం పై టాలీవుడ్ స్టూడియో, చిత్రమందిర్ స్టూడియో, చందానగర్, బీరంగూడా, ఘణ పూర్, షామీర్ పేట లలో భారీగా వేసిన సెట్స్ లో ప్రముఖ ఫైట్ మాస్టర్ “సింధూరం సతీష్ ” నేతృత్వంలో ఫైట్ సన్నివేశాలను షూట్ చేశారు.

Game Changer: అసలైన గేమ్ చేంజర్ దిగాడు.. ఇక జరగండి జరగండి జరగండి!

ఇక ఈ క్రమంలో మేకర్స్ మాట్లాడుటూ అక్టోబర్ 23 న ప్రారంభమైన యీ సినిమా చిత్రీకరణను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తున్నామని, ఇప్పటివరకు జరిగిన షూటింగ్ లో 80 శాతం టాకీ పార్ట్ తో పాటు ఫైట్స్ సన్నివేశాల చిత్రీకరణ ను పూర్తి చేశామని, జనవరి నెలాఖరు నాటికి మిగతా సన్నివేశాలతో పాటు పాటల చిత్రీకరణను కూడా పూర్తి చేసి షూటింగ్ కార్యక్రమాన్ని ముగిస్తామని” పేర్కొన్నారు. నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ భారత సైన్యంలో పనిచేసి వచ్చిన తనకు యుద్ధరంగంలో సైనికులకు ఉండే క్రమశిక్షణ సినిమా రంగంలో పనిచేసే టెక్నీషియన్స్ దగ్గర కనిపించిందని, టైం మెయింటెనెన్స్ అనేది సినిమా పరిశ్రమకు ఉన్న గొప్ప గుణం అని తనకు అర్థమైందని. ఈ రంగంలో పొందిన స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా సినిమా నిర్మాణాన్ని అలాగే కొనసాగిస్తూ సినిమా రంగంలోనే ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. గిడ్డేష్, హనుమా, గోవిందు, బాబురాం, జబర్దస్త్ వినోద్, వేణు రాక్, సకరాం, వైజాగ్ శివ, చీరాల సాయి, లాబ్ శరత్, హిమజ, జయ వాహిని, మేఘనా ఖుషీ, రుచిత, ఉజ్వలా రెడ్డి, అద్విత ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : కొండపల్లి నళినీ కాంత్ , సంగీతం : గజ్వేల్ వేణు అందిస్తున్నారు.