Mahesh Babu: ‘గుంటూరు కారం’ ఫైట్… ‘లియో’లో కాపీ కొట్టారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం. బాగా డిలే అయిన ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు జెస్ట్ స్పీడ్ లో జరుగుతుంది. 2024 సంక్రాంతి రిలీజ్ కి టార్గెట్ చేస్తూ త్రివిక్రమ్ గుంటూరు కారం షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ మూవీ స్టార్టింగ్ షెడ్యూల్ పై అభిమానులకి భారీ అంచనాలు ఉండేవి. మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా… ఈసారి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కాదు మాస్ సినిమా చేస్తున్నారు అనే న్యూస్ స్ప్రెడ్ అవ్వడం… ఆ తర్వాత ఓపెనింగ్ సీక్వెన్స్ ని సెన్సేషనల్ ఫైట్ మాస్టర్స్ అన్బు-అరువు కంపోజ్ చేస్తున్నారు అనే సరికి అంచనాలు ఇంకా పెరిగాయి. మహేష్ ఫేస్ కూడా రివీల్ చేయకుండా కట్ చేసిన అనౌన్స్మెంట్ వీడియోకి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. కొన్ని కారణాల వలన గుంటూరు కారం ఫస్ట్ షెడ్యూల్ లో జరిగిన ఈ ఎపిసోడ్ ని సినిమాలో వదట్లేదు. అన్బు-అరువు గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకోవడంతో రామ్-లక్ష్మణ్ ప్రస్తుతం ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.
గుంటూరు కారం నుంచి బయటకు వెళ్లిన అన్బు-అరువు… ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కి కంపోజ్ చేసిన యాక్షన్ బ్లాక్ ని ఇప్పుడు లియో సినిమాలో వాడారేమో అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే అక్టోబర్ 19న రిలీజ్ కానున్న లియో సినిమాని లోకేష్ కనగరాజ్ కంప్లీట్ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్ ఈ మూవీ పోస్టర్స్ ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ఒక గన్ మోడల్ లో వచ్చేలా లియో పోస్టర్ ని డిజైన్ చేసి రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్ లో విజయ్ సిట్టింగ్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే గుంటూరు కారం ఓపెనింగ్ షెడ్యూల్ లో ఉన్న మహేష్ బాబు గుర్తు రావడం గ్యారెంటీ. షూతో సహా సేమ్ మహేష్ బాబుని అన్బు-అరువు ఎలా చూపించాలి అనుకున్నారో అచ్చం అలానే విజయ్ ఉన్నాడు. మరి అదే యాక్షన్ ఎపిసోడ్ ని లియోకి షిఫ్ట్ చేసారా లేక సిమిలర్ సెటప్ లో ఉన్న యాక్షన్ ఎపిసోడ్ డిజైన్ చేసారా అనేది చూడాలి.
Also Read
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
తాజావార్తలు
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!