Fifa World Cup: ఫుట్‌బాల్ ప్రేమికులకు పండగే: జీ5లో ఫిఫా వరల్డ్ కప్ 2026 రచ్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో ఫుట్‌బాల్ క్రేజ్ సరికొత్త శిఖరాలను తాకబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన క్రీడా సంబరం ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ జీ5 వేదికగా భారతీయ ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 11 నుంచే ఈ ఫుట్‌బాల్ మహాసంగ్రామానికి సంబంధించిన లైవ్ యాక్షన్, హైలైట్స్, ప్రత్యేక విశ్లేషణలు జీ5 యాప్‌లో ప్రత్యక్షం కానున్నాయి. డిజిటల్ సాంకేతికత, హై-క్వాలిటీ స్ట్రీమింగ్‌తో కోట్లాది మంది అభిమానులకు స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగించడానికి జీ5 అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వివిధ రకాల డివైజ్‌ల ద్వారా ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా ఈ మ్యాచ్‌లను వీక్షించే సౌలభ్యాన్ని కల్పిస్తోంది.
అలానే దీన్ని రసవత్తరంగా మార్చేందుకు జీ5 ఒక క్రేజీ అప్డేట్ను ప్రకటించింది. భారత ఫుట్‌బాల్ లెజెండ్, మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా జీ5 ఎక్స్పర్ట్ ప్యానెల్లో చేరారు. దేశంలో ఫుట్‌బాల్ ఆటపై చెరగని ముద్ర వేసిన భూటియా.. తన సుదీర్ఘ అనుభవం, వ్యూహాత్మక చతురతతో మ్యాచ్‌లకు సంబంధించిన లోతైన విశ్లేషణలను అభిమానులకు అందించనున్నారు. జీ ఎంటర్టైన్మెంట్, ఫిఫా మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందంలో భాగంగా 2034 వరకు అన్ని ప్రధాన ఫిఫా టోర్నమెంట్లు జీ5, యునైట్ 8 వేదికలపై ప్రసారం కానున్నాయి. ఇందులో 2026 వరల్డ్ కప్‌తో పాటు.. ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2027, ఫిఫా వరల్డ్ కప్ 2030 వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలు కూడా ఉన్నాయి. ఈ ఆటను ఆస్వాదించేందుకు వీలుగా.. ఇంగ్లీష్, హిందీ, బెంగాళీ, మలయాళం భాషల్లో సమగ్ర కవరేజ్‌ను అందించనున్నారు. ఇక ఆలస్యం ఎందుకు? జూన్ 11 నుండి జీ5 స్క్రీన్లపై మీ ఫేవరెట్ జట్ల ‘ఫిఫా’ సమరాన్ని చూసి ఎంజాయ్ చేయండి!
Also Read
- Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా... "పోలీస్ కంప్లైంట్" డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
- NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
తాజావార్తలు
-
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!