NTV Telugu Site icon

Murali Mohan : మురళీమోహన్ కి ఘన సన్మానం.. ‘నటసింహ చక్రవర్తి’ బిరుదు ప్రధానం

Murali Mohan Felicitaion

Murali Mohan Felicitaion

Felicitation to Murali Mohan by VB Entertainments: విబి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ 2023 వేడుక ఘనంగా జరిగింది. ఈ క్రమంలో డా. ఎం. మురళీమోహన్ గారికి సన్మానం జరిగింది. ఈ వేడుకలో మురళీమోహన్ మాట్లాడుతూ విష్ణు బొప్పన ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు చాలా సంతోషంగా ఉందని మంత్రి చేతుల మీదుగా నాకు ఈ సన్మానం జరగడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. ఆయన ఎంతో బిజీగా ఉండి కూడా ఈవెంట్ వచ్చి నా సన్మానానికి హాజరై ఇలా ఆశీస్సులు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్న మురళీ మోహన్ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా, ఈ విబి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ ఫంక్షన్ ఇలా పదో వార్షికోత్సవం విజయవంతంగా జరుపుకోవడం ఈ ఫంక్షన్ లో నన్ను సన్మానించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. విష్ణు బొప్పన అలాగే అవార్డ్స్ ఫంక్షన్ కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, నా 50 సంవత్సరాల నట జీవితాన్ని పురస్కరించుకుని ‘నటసింహ చక్రవర్తి’ బిరుదు ఇవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.

Prashant Neel: కార్పొరేట్ బుకింగ్స్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ ఇండస్ట్రీలో అవార్డులు వాళ్ళు చేసిన కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ అవార్డులు అందిస్తోంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి నంది అవార్డులకున్న విశిష్టత మనకు తెలుసు, కానీ తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డుల గురించి పట్టించుకోవడమే మానేశాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వ హయాంలో మళ్లీ అది మొదలు పెట్టాలని ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అవార్డులను ఇవ్వాలి అలానే ఇకనుంచి ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా జరిగేలా మీ ప్రభుత్వం చూడాలి అని విజ్ఞప్తి చేసుకుంటున్నానన్నారు. మురళీమోహన్ గారు చేసిన విజ్ఞప్తికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ మురళీమోహన్ చెప్పిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళు అందరం ఒకటే, గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వాల్సి ఉన్న అవార్డులు అన్నిటినీ కూడా కచ్చితంగా ఇచ్చే విధంగా మా గవర్నమెంట్ చేస్తుంది అని స్పందించారు.