NTV Telugu Site icon

Fast X: దీన్ని మించిన యాక్షన్ సినిమా చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా…

Fast X

Fast X

వరల్డ్ సినిమాలో ఎన్నో యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు వచ్చి ఉంటాయి, ఇకపై కూడా వస్తాయి కానీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యురియస్’ రేంజ్ యాక్షన్ ఫ్రాంచైజ్ ఇప్పటివరకూ రాలేదు, ఇకపై కూడా రాకపోవచ్చు. యాక్షన్ బ్లాక్స్ కి, కార్ రేసింగ్ సీన్స్ కి, హై రిస్క్ స్టంట్స్ కి కేరాఫ్ అడ్రెస్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యురియస్ ఫ్రాంచైజ్’. ఈ ఫ్రాంచైజ్ నుంచి పదో సినిమా, ‘ఫాస్ట్ X’ అనే టైటిల్ తో మే 19న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ యాక్షన్ ఎక్స్ట్రావెంజా ఫ్రాంచైజ్ ఈ సినిమాతో కంప్లీట్ అవుతుంది కాబట్టి మూవీ లవర్స్ ‘ఫాస్ట్ X’ సినిమాని ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ రేంజులో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటివరకూ ఫాస్ట్ అండ్ ఫ్యురియస్ ఫ్రాంచైజ్ లో కనిపించిన ప్రతి సెలబ్రిటీని మళ్లీ తీసుకోని వచ్చారు, కొత్త క్యారెక్టర్స్ ని కూడా యాడ్ చేశారు. దీంతో ఫాస్ట్ X సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విన్ డీజల్ ఫ్రాంచైజ్ ఎండింగ్ సినిమాలో గెలిచి, తన ఫ్యామిలీని కాపాడుకోని ఫ్రాంచైజ్ కి విన్ డీజల్ ఇవ్వబోయే గ్రాండ్ క్లోజింగ్ ఏ రేంజులో ఉంటుందో చిన్న శాంపిల్ చూపిస్తూ ఫాస్ట్ X ట్రైలర్ 2 బయటకి వచ్చింది.

లూయిస్ లెటెరియర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫాస్ట్ X’ ఇప్పటివరకూ ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన అన్ని సినిమాల కన్నా టెన్ టైమ్స్ గ్రాండ్ గా ఉంది. విన్ డీజల్, జాసన్ మోమోవా, హెలెన్ మిర్రెన్, చార్లీజ్ థెరాన్, జాసన్ స్టాథమ్, మిచెల్ రోడ్రిగ్జ్, టైరీస్ గిబ్సన్, క్రిస్ “లుడాక్రిస్” బ్రిడ్జెస్, నథాలీ ఇమ్మాన్యుయెల్, జోర్డానా బ్రూస్టర్, సుంగ్ కాంగ్, జాన్ సెనా, స్కాట్ ఈస్ట్‌వుడ్, రీటా మోరెనో, అలాన్ రిచ్ట్‌సన్, డానియెలా మెల్చియర్ మరియు బ్రీ లార్సన్‌ ల హ్యూజ్ స్టార్ కాస్ట్ ఫాస్ట్ X ట్రైలర్ లో కనిపించారు. ఎప్పటిలాగే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, రేసీ కార్ చేజ్ ఎపిసోడ్స్, ఫైట్స్ తో ఫాస్ట్ X ట్రైలర్ లో మరింత గ్రాండ్ గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ లో కోట్ల కర్చు కనిపిస్తోంది. ఫ్రాంచైజ్ క్లోజింగ్ సినిమా అనేది పర్ఫెక్ట్ ఇలానే ఉండాలి అనే రేంజులో ఎక్కడా తగ్గకుండా మేకర్స్ ఈ సినిమాని తెరకెక్కించినట్లు ఉన్నారు. ముఖ్యంగా విన్ డీజల్, జాసన్ మోమోవా మధ్య బిల్డ్ చేసిన ట్రాక్ మొత్తం ఫాస్ట్ అండ్ ఫ్యురియస్ ఫ్రాంచైజ్ కే హైలైట్ అయ్యేలా ఉంది. మరి ఈ ఫ్రాంచైజ్ చూసిన స్ట్రాంగెస్ట్ విలన్ నుంచి తన ఫ్యామిలీని విన్ డీజల్ ఎలా కాపాడుకుంటాడు అనేది చూడాలి.

Show comments