ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ శిల్పా రెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులను కలిశారు. శిల్పా రెడ్డి నటుడు సమీర్ రెడ్డికి సోదరి, అలాగే సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు. ఇటీవలే వారిద్దరూ కలిసి ఆధ్యాత్మిక ఛార్ ధామ్ యాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా శిల్పా సీఎం జగన్ ను విజయవాడలో కలిసినట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు.
Read Also : బాలయ్యపై మీమ్స్… “అఖండ”పై తమన్ క్రేజీ వన్‌లైనర్ పంచులు
ఇంస్టాగ్రామ్ లో ఆమె జగన్ దంపతులతో ఉన్న పిక్ షేర్ చేస్తూ “ఇంత ఆతిథ్యం, ప్రేమ మరియు ఆప్యాయతతో నన్ను మీ ఇంటికి స్వాగతించినందుకు ధన్యవాదాలు భారతి, జగన్ గారూ… ఇలాంటి అందమైన జంటను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది” అంటూ రాసుకొచ్చింది. ఈ పిక్ లో జగన్, ఆయన సతీమణి భారతితో పాటు శిల్పా రెడ్డి కన్పిస్తున్నారు. అయితే ఈ పోస్టులో ఆమె సీఎంను ఎందుకు కలిసింది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో అదే ఇప్పుడు సస్పెన్స్ అయ్యింది. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు శిల్పా జగన్ దంపతులను ఎందుకు కలిసింది ? దాని వెనుక కారణం ఏంటి? అంటూ సినీ, రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి.
