Faria Abdullah : యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా గురించి పరిచయం అక్కర్లేదు. జాతిరత్నాలు సినిమాతో ఎంట్రీ ఇస్తూనే అందరి చూపు తన మీద పడేసుకుంది. హైట్, క్యూట్ అన్నట్టు కుర్రాళ్లను పడేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా పవన్ కల్యాణ్, ప్రభాస్ మీద సంచలన కామెంట్లు చేసింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్న ఈ భామ తాజాగా యాంకర్ సుమ నిర్వహిస్తున్న చాట్ షో ప్రోగ్రామ్ లేటెస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా వచ్చింది. ఇందులో సుమ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వేసింది. నీకు ఛాన్స్ వస్తే ఎవరితో డేట్ చేస్తావ్, ఎవరిని పెళ్లి చేసుకుంటావ్ అని అడిగింది. ఫరియా మాట్లాడుతూ.. ‘నాకు ఛాన్స్ వస్తే పవన్ కల్యాణ్ తో డేటింగ్ చేస్తా.. ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా’ అంటూ చెప్పుకొచ్చింది.
Read Also : Samantha: నాకు గుడి కట్టడాన్ని ఎంకరేజ్ చేయను!
ఈ కామెంట్లు వెంటనే వైరల్ అయిపోతున్నాయి. అటు ప్రభాస్ ఫ్యాన్స్, ఇటు పవన్ ఫ్యాన్స్ చిట్ట కామెంట్స్ ను విపరీతంగా వైరల్ చేసేస్తున్నారు. ఇది తమ హీరోల క్రేజ్ అంటూ తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. ఫరియా వరుస సినిమాలు చేస్తున్నా ఆమెకు మాత్రం స్టార్ డమ్ ఇంకా రావట్లేదు. డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె.. తర్వాత నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో జాతిరత్నాలు ఆడిషన్ కు వెళ్లింది. అదే ఆమెకు ప్లస్ అయింది. ఆ మూవీతో మంచి ఎంట్రీ హిట్ పడింది. ఇప్పటికీ ఆమెను ఫరియా అని కాకుండా చిట్టి అనే పిలుస్తున్నారంటే ఆమె పాత్రకు దక్కిన గుర్తింపు అనే చెప్పుకోవాలి.
Read Also :Samantha : అతని కోసమే పికిల్ బాల్ టీమ్ కొన్నాను!
