Faria Abdullah: చిట్టి.. నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. అంటూ జాతిరత్నాలను మొత్తం తన చుట్టూ తిప్పించుకున్న బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది అనుకున్నారు. కానీ, సెకండ్ హీరోయిన్ కే పరిమితమయ్యింది. ముఖ్యంగాఈ ఏడాది వచ్చిన రావణాసుర సినిమాలో ఫరియా డ్యాన్స్ తప్ప .. ఆమెకు పేరు వచ్చింది కూడా ఏం లేదు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం చంపేస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్, డ్యాన్స్ వీడియోలతో దుమ్మరేపుతోంది. ఇక ఈ చిన్నది నేడు హైదరాబాద్ లో జరిగిన ఆర్గానిక్ గాలా ఈవెంట్ లో ర్యాంప్ షో లో సందడి చేసింది. చీరకట్టు లో ముద్దుగుమ్మ యమా అందంగా ఉందని మురిసిపోయేలోపు ఆ చీరకట్టిన విధానాన్ని చూడగానే చిర్రెత్తుకొస్తుందని అంటున్నారు నెటిజన్లు. తెలుగు తనాన్నికి గౌరవాన్ని పెంచే చీరను ఈ ముద్దుగుమ్మ ఫ్యాషన్ పేరుతో చెడగొట్టింది అని చెప్పుకొస్తున్నారు.
Mahesh fans : త్రివిక్రమ్ పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్..?
అంతలా ఎలా చెడగొట్టింది అంటే.. సాధారణంగా చీరను ఎలా కడతారు. లోపల లంగా వేసుకుంటారు. దాని చుట్టూ చీరను చుట్టూ.. కుచ్చిళ్ళు పెట్టి.. పైటను ఎదమీదగా కిందకు వదులుతారు. అది అందరికి తెలిసిందే. అయితే ఇక్కడ చిట్టి మాత్రం.. కుచ్చిళ్ళు పోసింది.. పైట వేసింది కానీ, లోపల లంగా మాత్రం వేయలేదు. పైన షార్ట్ జీన్స్ లాంటింది వేసి.. దానికి చీరను చుట్టూ.. ఒకపక్క థైస్ మొత్తం కనిపించేలా చేసి.. ఇంకోపక్క కుచ్చిళ్ళు పెట్టింది. ఆమె నడుస్తున్న సమయంలో ఆ థైస్ మొత్తం బయటికి కనిపిస్తున్నాయి. మాములుగా చూస్తుంటే ఆమె చీరకట్టినట్లే ఉంది.. కాకపోతే లోపల మాత్రం ఏం వేసుకోలేదు అంతే . ఇక ఈ ఫ్యాషన్ పై అభిమానులు మండిపడుతున్నారు. చీరను ఇలాగేనా కట్టుకునేది అని కొందరు అంటుండగా.. మీ మీద ఉన్న గౌరవం పోయింది అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.