Site icon NTV Telugu

Faria Abdullah: ప్రభాస్ ఎక్కడికెళ్లినా వాళ్ళు ఉండాల్సిందే.. సీక్రెట్ బయటపెట్టిన చిట్టి!

Prabhas

Prabhas

Faria Abdullah Comments on Prabhas: హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా తెలుగులో జాతి రత్నాలు అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు తర్వాత కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆ సినిమాలు ఏవి పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. ప్రస్తుతానికి ఆమె అల్లరి నరేష్ తో కలిసి ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా చేసింది. పెళ్లి అనే కాన్సెప్ట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మే మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొంటున్న క్రమంలో ఆమె ఎన్టీవీకి ఒక ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇక ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అసలు విషయం ఏమిటంటే జాతి రత్నాలు సినిమా ట్రైలర్ ప్రభాస్ లాంచ్ చేశారు.

Varalaxmi: వరలక్ష్మీ కాబోయే భర్త కండలపై కామెంట్స్.. ప్రభాస్ పేరు చెప్పి నోరు మూయించేసిందిగా!

ఆ సమయంలో జాతి రత్నాలు టీం ప్రభాస్ దగ్గరికి వెళ్ళింది. ఈ క్రమంలో ప్రభాస్ అప్పుడు ఎలాంటి ఫుడ్ పెట్టారు? అని ప్రశ్నిస్తే దానికి ఆమె ఆసక్తికరంగా స్పందించింది. తనకు అప్పుడు ఏం పెట్టారో గుర్తులేదు కానీ ప్రభాస్ అంటేనే ఆతిథ్యానికి మారు పేరు అని చెప్పుకొచ్చింది. అంతే కాదు ప్రభాస్ తో పాటు ఎప్పుడూ ఒక చెఫ్ టీం ఉండాల్సిందేనని, ఒక కుక్ ఒక అసిస్టెంట్ కుక్ ఎప్పుడూ ఆయన ఏమి అడిగితే అది వండి పెట్టడానికి సిద్ధంగా ఉంటారని చెప్పుకొచ్చింది. ఇక తనని చూసి మొట్టమొదటిసారిగా హీల్స్ కూడా వేసుకోకుండా ఇంత ఎత్తు ఉంది ఏంటి అన్నారని ఆ తర్వాత నా బ్యాక్ గ్రౌండ్ గురించి నేను చేసే సినిమాలు గురించి అడిగి తెలుసుకున్నారు అని చెప్పుకొచ్చింది. ప్రభాస్ ఒక స్టార్ అని గర్వం చూపించడు ఆయన ఎప్పుడూ డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగానే అనిపిస్తాడు అంటూ ఫరియా అబ్దుల్లా కామెంట్స్ చేసింది.

Exit mobile version