Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈరోజు చై పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎందుకంటే .. నేటితో చైతన్య ఇండస్ట్రీకి అడుగుపెట్టి 14 ఏళ్లు పూర్తీ అయ్యాయి. 14 ఏళ్ళ క్రితం ఇదే రోజున చై నటించిన జోష్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అక్కినేని హీరోకు మంచి విజయాన్ని అయితే అందివ్వలేకపోయింది కానీ, చై లో ఉన్న ఫైర్ ను మాత్రం చూపించింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే చైతన్య పర్సనల్ లైఫ్ గురించి రోజుకో రూమర్ బయటికి వస్తుంది. సమంత తో విడాకులు తరువాత కెరీర్ మీద ఫోకస్ పెట్టిన ఈ కుర్రాడు.. ఇంకోపక్క హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నాడని టాక్ నడుస్తోంది. అయితే ఈ పుకార్లపై శోభితా స్పందించినా.. చై మాత్రం ఇప్పటివరకు అది నిజం కాదు అని కూడా చెప్పలేదు. వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందా.. ? లేదా.. ? అనేది అభిమానులకు ఇప్పటికీ కన్ఫ్యూజ్ గానే ఉంది. ఇక అప్పుడప్పు మాత్రం వీరు రిలేషన్ లో ఉన్నట్లు అనుమానాలు వచ్చేలా ప్రవర్తిస్తూ ఉంటారు. గతంలో వీరిద్దరూ ఒక రెస్టారెంట్ లో కలిసి కనిపించారు. ఆ ఫోటో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక తాజాగా.. చై రిఫర్ చేసిన పుస్తకాన్ని పట్టుకొని శోభితా ఫోటోలకు ఫోజ్ లు ఇస్తూ కనిపించింది. ఇది కేవలం కో ఇన్సిడెంట్ కావచ్చు.. కానీ, అభిమానులు మాత్రం వీరి మధ్య ఏదో నడుస్తుంది అనే చెప్పుకొస్తున్నారు. అసలు విషయం ఏంటంటే .. కొన్ని రోజుల క్రితం చై.. గ్రీన్ లైట్స్ అనే పుస్తకం గురించి చెప్తూ.. “జీవితానికి ఒక ప్రేమ లేఖ .. మీ ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు మాథ్యూ మాక్కనౌగే చాలా థాంక్స్ .. ఈ పఠనం నాకు గ్రీన్ లైట్ ను నింపింది.. రెస్పెక్ట్ సర్” అని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా అదే బుక్ ను శోభితా షేర్ చేస్తూ.. “గత కొన్ని నెలల్లో నేను చదివిన అత్యుత్తమ పుస్తకం. ఎంత అపురూపమైన జీవిత కథ. ఒక పాట లాగా, నిజంగా. విపరీతమైన నవ్వు మరియు స్వాతంత్య్రాన్ని సంపాదించిన రుచిలా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇది చూసిన అభిమానులు.. చైతన్య ఈ బుక్ చదవమని సజిస్ట్ చేశాడా.. ? లేక బుక్ గిఫ్ట్ ఇచ్చాడా.. ?ఆ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.