Site icon NTV Telugu

Pawan Kalyan: అన్నకు పద్మ పురస్కారం.. తమ్ముడు రాకకై ఎదురుచూపులు.. ?

Pawan

Pawan

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం చిరుకు పద్మ విభూషణ్ అవార్డును అందించనుంది. ఇక ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీ మొత్తం చిరు ఇంటి ముందే నిలిచింది. చిన్నా, పెద్ద అని తేడాలేకుండా నటీనటులు అందరూ చిరుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక కుటుంబ సభ్యులు అయితే సంబురాలు కూడా చేసుకున్నారు. అయితే ఇంత పెద్ద అవార్డును అచీవ్ చేసిన అన్నకు శుభాకాంక్షలు చెప్పడానికి తమ్ముడు పవన్ రాలేదే అన్న బాధ పవన్ ఫ్యాన్స్ ను కొద్దిగా బాధను కలుగజేస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ ప్రచారంలో చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు. నిత్యం పప్రచార సభలు, ప్రజలను కలవడం, వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం.. ఇలాగే పవన్ షెడ్యూల్ ఉంటుంది. దీంతో ఏపీని వదిలి పవన్ తెలంగాణకు రాలేకపోయాడు.

చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడంతోనే పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా శుభకాంక్షలు తెలిపారు. “భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య శ్రీ చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఎంత ట్వీట్ చేసినా.. చిరు, పవన్ ను కలిసి శుభకాంక్షలు చెప్పడం, ఆ ఫోటోలు కావాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఎంతమంది వచ్చినా కూడా ఫ్యాన్స్ కు పవన్ రాని లోటు కనిపిస్తుందని చెప్పనవసరం లేదు. మరి అన్న కోసం.. పవన్ వీలు చూసుకొని వస్తారేమో చూడాలి.

Exit mobile version