NTV Telugu Site icon

balayya: ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా అదిరిపోయాయి…

Balayya

Balayya

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’. బాలయ్య అభిమాని అయిన దర్శకుడు ‘గోపీచంద్ మలినేని’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. తనకి టైలర్ మేడ్ రోల్ లాంటి ఫ్యాక్షన్ పాత్రలో బాలకృష్ణ చాలా కాలం తర్వాత కనిపించనుండడంతో నందమూరి అభిమానులు ‘వీర సింహా రెడ్డి’ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గోపీచంద్ మలినేని నందమూరి అభిమానులని మరింత ఊరిస్తూ, బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. బాలయ్య ఫాన్స్ కూడా తామేమి తక్కువ కాదన్నట్లు ‘ఫ్యాన్ మేడ్’ పోస్టర్స్ ని రెడీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

Read Also: Unstoppable: బాహుబలి ఎపిసోడ్ అనుకున్న దానికన్నా ముందే…

‘వీర సింహా రెడ్డి’ ప్రొడ్యూసర్స్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఇటివలే ఈ మూవీ మేకింగ్ స్టిల్స్ ని రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య అద్దాలు పెట్టుకోని మాస్ లుక్ లో కనిపించిన ఫోటో ఒకటుంది. ఈ ఫోటోని నందమూరి ఫాన్స్ సూపర్బ్ గా ఎడిట్ చేసి… ‘గాడ్ ఆఫ్ మాసెస్’ అనే ట్యాగ్ లైన్ ని పోస్టర్ లో పెట్టారు. స్టైలిష్ ఫాంట్ లో ‘గాడ్ ఆఫ్ మాసెస్’ ట్యాగ్ కనిపించగా, బాలయ్య మాస్ గా ఉన్నాడు. ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ని గోపీచంద్ మలినేని షేర్ చేసి మరింత మందికి రీచ్ అయ్యేలా చేశాడు. మొబైల్ వాల్ పేపర్ పెట్టుకునే రేంజులో పోస్టర్ ఉంది కాబట్టి నందమూరి అభిమానులంతా ఫోన్ వాల్ పేపర్స్ ని మార్చేయడం గ్యారెంటీ. ఇదిలా ఉంటే ‘వీర సింహా రెడ్డి’ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి, ఇందులో భాగంగా నెక్స్ట్ ఒక సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేయనున్నారట. శృతి హాసన్, బాలకృష్ణల మధ్య ఇటివలే షూట్ చేసిన సాంగ్ త్వరలో బయటకి రానుందని సమాచారం. ఇప్పటికే వీర సింహా రెడ్డి సినిమా నుంచి మూడు సాంగ్స్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

Read Also: Veera Simha Reddy: ఈ ఒక్క పాటతో తమన్ కి ఫుల్ బిర్యానీ పెట్టేయొచ్చు…