NTV Telugu Site icon

Family Star: సంక్రాంతి రేసు నుంచి విజయ్ దేవరకొండ అవుట్.. ?

Vijay

Vijay

Family Star: ది విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుందని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ ప్లాన్ చేశారు. కానీ, ఈ సినిమా పరిస్థితి చూస్తుంటే.. సంక్రాంతికి రావడం కష్టమే అని చెప్పుకొస్తున్నారు. ఎప్పటి నుంచో షూటింగ్ కోసం అమెరికా వెళ్ళడానికి టీమ్ రెడీ అవుతున్నారని.. కానీ, వీసాలు రాని కారణంగా ఆ షెడ్యూల్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.

Devi Sri Prasad: పెంచు..పెంచు.. హైప్ పెంచు.. నీయవ్వ.. తగ్గేదేలే

ఇక దీని తరువాత కొద్దిరోజులకు అమెరికా కాకుండా బ్యాంకాక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇక ఇప్పుడు మళ్లీ బ్యాంకాక్ వదిలేసి.. అమెరికాలోనే షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. వీసాల కోసం మళ్లీ అప్లై చేస్తున్నట్లు సమాచారం. ఇంకోపక్క ఈ సినిమా డిజిటల్ పార్ట్నర్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఏ ఓటిటీ.. ఫ్యామిలీ స్టార్ ను కొనేందుకు సముఖత లేదని వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి కావడంతో ఇప్పటికే తీసుకున్న సినిమాలతో పాటు ఇది తీసుకుంటే.. రెండు ఒకేసారి స్ట్రీమింగ్ ఇవ్వడం వలన తామే నష్టపోతామని ఓటిటీ మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇన్ని సమస్యల మధ్య ఫ్యామిలీ స్టార్ సంక్రాంతికి రిలీజ్ అవ్వడం కష్టమని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Show comments