NTV Telugu Site icon

Family Star: అయ్యో.. ఫ్యామిలీ స్టార్ ను ఎవరు దగ్గరకు రానివ్వడంలేదట.. ?

Vijay

Vijay

Family Star: లైగర్ లాంటి డిజాస్టర్ తరువాత ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని యావరేజ్ గా నిలిచింది. ఇక ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టి.. మళ్లీ రేసులో నిలబడాలి అని విజయ్ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే విజయ్.. గీతగోవిందం కాంబోతో జతకట్టాడు. పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ వీడియో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. ఇకపోతే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. సంక్రాంతి రేసులో విజయ్ చాలా రేర్ గా దిగుతున్నాడు. అందులోనూ దిల్ రాజు కాబట్టి.. మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

Salaar: సలార్ అప్డేట్ వచ్చిందిరోయ్..

ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి నెట్టింట ఒక షాకింగ్ వార్త వినిపిస్తుంది. సంక్రాంతి రేసు నుంచి ఫ్యామిలీ స్టార్ తప్పుకొనే ఛాన్స్ లు ఉన్నాయని అంటున్నారు. అందుకు కారణం.. ఇప్పటివరకు ఫ్యామిలీ స్టార్ డిజిటల్ అవ్వలేదట. సాధారణంగా.. థియేటర్ హక్కుల కంటే.. డిజిటల్ హక్కులే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఓటిటీనే జనాలు ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి.. ఓటిటీ మేకర్స్ కూడా సినిమాలను ఏరికోరి ఎంచుకొని కొంటున్నారు. ఇక ఇప్పటికే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ పోటాపోటీగా మంచి హిట్ సినిమాలను అందుకొని తమ సత్తా చూపుతున్నాయి. అయితే నెట్ ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ.. ఫ్యామిలీ స్టార్ మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదట. సంక్రాంతి సినిమాల లిస్ట్ లో హైప్ తెచ్చుకున్న గుంటూరు కారం హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఇక ఆ సినిమా రిలీజ్ టైమ్ లోనే ఫ్యామిలీ స్టార్ కూడా రిలీజ్ కానుంది. ఒకవేళ రెండు కొంటే .. రెండు ఒకేసారి స్ట్రీమింగ్ చేయాలి. దీనివలన నెట్ ఫ్లిక్స్ కు నష్టం తప్పదు.. అందుకే తమకు వద్దు అని చెప్తున్నారట. ఇంకోపక్క అమెజాన్ ప్రైమ్ వెంకటేష్ సైంధవ్ కు కోట్లు ఖర్చు పెట్టింది. అదే నాలుగు వారాలకు ఫ్యామిలీ స్టార్ ను అంత ఖర్చుపెట్టి కొని.. రెండు ఒకేసారి స్ట్రీమింగ్ చేయలేవు. కాబట్టి అమెజాన్ కూడా నో అని చెప్పేసిందట. దీంతో దిల్ రాజు.. ప్రస్తుతం సందిగ్ద పరిస్థితిలో ఉన్నాడని సమాచారం. మరి ఈ సినిమాను సంక్రాంతి నుంచి తప్పించకుండా.. డిజిటల్ హక్కులను అమ్మకుండా దిల్ రాజు ఎలా ఈ సినిమాను హిట్ చేస్తాడో చూడాలి.

Show comments