Fahadh Faasil: ‘పుష్ప 2’ తర్వాత ఫహద్ ఫాసిల్ మరో సర్ప్రైజ్.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్‌తో భారీ హైప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fahadh Faasil: ‘పుష్ప 2’లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్. అయితే ఇప్పుడు తెలుగు హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఫహద్, ఈసారి కూడా భిన్నమైన ఫాంటసీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్ ఈవాల విడుదల అయింది. థ్రిల్లింగ్, ఫాంటసీ, కామెడీ కలగలిపిన ఈ టీజర్ కు ప్రేక్షకుల్లో మంచి హైప్ వస్తోంది.
2024 మార్చిలో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ప్రజల ముందుకు రాబోతోంది. దర్శకుడిగా శశాంక్ యేలేటి తొలి ప్రయత్నం చేస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ ‘సూరి’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన ‘దివ్య’ పాత్రలో సారా అనే అమ్మాయి నటిస్తోంది. హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఈ కథలో సూరి జీవితంలోకి దివ్య ప్రవేశించిన తర్వాత అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆమెకు మనుషులకు లేని కొన్ని విచిత్రమైన శక్తులు ఉన్నాయని సూరి గుర్తిస్తాడు. దీంతో ఆమె నిజంగానే దెయ్యమా? లేక ఆ రహస్యాల వెనుక మరేదైనా కారణం ఉందా? అనే సందేహాల చుట్టూ కథ ముందుకు సాగుతుంది.
Also Read
తాజాగా విడుదలైన టీజర్ సినిమా కథను పూర్తిగా బయటపెట్టకుండా, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా రూపొందించారు. ఫహద్ ఫాసిల్ తన నటనతో మరోసారి పూర్తిగా ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నారు. మరోవైపు సారా కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. ఫాంటసీ అంశాలతో పాటు థ్రిల్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్లో నిర్మాణ సంస్థలైన ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు. అంతేకాదు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
నిర్మాతలు ప్రకటించిన వివరాల ప్రకారం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రం 2026 సెప్టెంబర్ 11న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో విడుదల కానుంది. మాలీవుడ్‌లో ఇప్పటికే అగ్ర నటుడిగా గుర్తింపు పొందిన ఫహద్ ఫాసిల్‌కు ఇది నేరుగా తెలుగు మార్కెట్లో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు. టీజర్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే, విడుదలకు ముందే ఈ సినిమా చుట్టూ మంచి బజ్ ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు ఫహద్ ఫాసిల్ తొలి తెలుగు మూవీ ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.
- Tags
- cinema
- Fahadh Faasil
తాజావార్తలు
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!