Fahadh Faasil : ‘దృశ్యం 3’ నిర్మాతలతో ఫహద్ ఫాసిల్ క్రేజీ డీల్… వరుస ప్రాజెక్టులు

Fahadh Faasil (2)

Fahadh Faasil (2)

Fahadh Faasil : మలయాళ ఇండస్ట్రీలో ఫహద్ ఫాసిల్ క్రేజ్ గురించి ప్రత్యేకించి వివరించాల్సిన పని లేదు. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే కథలను ఎంచుకోవడంలో పేరుగాంచిన ఫహద్, మరోసారి అదే తరహా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నటుడు వరుస భారీ ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. ‘దృశ్యం 3’ నిర్మాతలతో ఆయన రీసెంట్ గా కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘దృశ్యం 3’ హిట్ తరువాత ప్రముఖ నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్, నిర్మాత జాకబ్ బాబుతో కలిసి రెండు కొత్త ఫీచర్ చిత్రాలను నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ రెండు చిత్రాల్లోనూ ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలను వచ్చే ఏడాది విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘దృశ్యం’ ఫ్రాంచైజీతో మలయాళ చిత్ర పరిశ్రమలో మరింత బలమైన స్థానం సంపాదించిన పనోరమా స్టూడియోస్, ఇప్పుడు కూడా కంటెంట్ ఆధారిత చిత్రాలపైనే దృష్టి సారిస్తోంది.

ఈ ప్రాజెక్టుల గురించి స్పందించిన ఫహద్ ఫాసిల్, కథ నచ్చడంతోనే ఆ పాత్రల్లో నటించడానకి అంగీకరించానని తెలిపారు. ఒక నటుడిగా విభిన్న పాత్రల కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటానని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే కథల్లో భాగమవడం తనకు ఎప్పుడూ ప్రత్యేక ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. జాకబ్ బాబు, పనోరమా స్టూడియోస్ బృందంతో జరిగిన చర్చలు తనకి ఎంతో స్ఫూర్తినిచ్చాయని, ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది ఈ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

×
×
Ad

పనోరమా స్టూడియోస్ అధినేత కుమార్ మంగత్ పాఠక్ కూడా ఈ కలయికపై సంతోషం వ్యక్తం చేశారు. ఫహద్ ఫాసిల్ వంటి ప్రతిభావంతుడితో కలిసి పనిచేయడం తమకు ఆనందంగా ఉందన్నారు. భాషలకు అతీతంగా ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకునే అరుదైన నటుల్లో ఫహద్ ఒకరని ఆయన ప్రశంసించారు. నిర్మాత అభిషేక్ పాఠక్ కూడా ఫహద్ గురించి స్పందిస్తూ, ప్రేక్షకులను అలరించే బలమైన కథలను తెరకెక్కించడం పనోరమా స్టూడియోస్ లక్ష్యమని చెప్పారు. ఈ కథలు చర్చించిన మొదట్లోనే ఫహద్ ఫాసిల్ ఈ పాత్రలకు సరైన న్యాయం చేయగలరని తాము భావించామన్నారు. ఆయన పాత్రల్లో పూర్తిగా లీనమయ్యే తీరు, కథల ఎంపికలో చూపే పరిపక్వత కారణంగానే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయ నటుల్లో ఒకరిగా నిలిచారని పేర్కొన్నారు. జాకబ్ బాబుతో తమ భాగస్వామ్యం మలయాళ చిత్రసీమలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని కూడా ఆయన వెల్లడించారు. ఇక దర్శకులు, ఇతర నటీనటులు, టెక్నికల్ టీంకు సంబంధించిన పూర్తి వివరాలను మరి కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.