Fahadh Faasil : ‘దృశ్యం 3’ నిర్మాతలతో ఫహద్ ఫాసిల్ క్రేజీ డీల్… వరుస ప్రాజెక్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fahadh Faasil : మలయాళ ఇండస్ట్రీలో ఫహద్ ఫాసిల్ క్రేజ్ గురించి ప్రత్యేకించి వివరించాల్సిన పని లేదు. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే కథలను ఎంచుకోవడంలో పేరుగాంచిన ఫహద్, మరోసారి అదే తరహా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నటుడు వరుస భారీ ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. ‘దృశ్యం 3’ నిర్మాతలతో ఆయన రీసెంట్ గా కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘దృశ్యం 3’ హిట్ తరువాత ప్రముఖ నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్, నిర్మాత జాకబ్ బాబుతో కలిసి రెండు కొత్త ఫీచర్ చిత్రాలను నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ రెండు చిత్రాల్లోనూ ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలను వచ్చే ఏడాది విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘దృశ్యం’ ఫ్రాంచైజీతో మలయాళ చిత్ర పరిశ్రమలో మరింత బలమైన స్థానం సంపాదించిన పనోరమా స్టూడియోస్, ఇప్పుడు కూడా కంటెంట్ ఆధారిత చిత్రాలపైనే దృష్టి సారిస్తోంది.
ఈ ప్రాజెక్టుల గురించి స్పందించిన ఫహద్ ఫాసిల్, కథ నచ్చడంతోనే ఆ పాత్రల్లో నటించడానకి అంగీకరించానని తెలిపారు. ఒక నటుడిగా విభిన్న పాత్రల కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటానని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే కథల్లో భాగమవడం తనకు ఎప్పుడూ ప్రత్యేక ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. జాకబ్ బాబు, పనోరమా స్టూడియోస్ బృందంతో జరిగిన చర్చలు తనకి ఎంతో స్ఫూర్తినిచ్చాయని, ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది ఈ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
- SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. 'వారణాసి' ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
పనోరమా స్టూడియోస్ అధినేత కుమార్ మంగత్ పాఠక్ కూడా ఈ కలయికపై సంతోషం వ్యక్తం చేశారు. ఫహద్ ఫాసిల్ వంటి ప్రతిభావంతుడితో కలిసి పనిచేయడం తమకు ఆనందంగా ఉందన్నారు. భాషలకు అతీతంగా ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకునే అరుదైన నటుల్లో ఫహద్ ఒకరని ఆయన ప్రశంసించారు. నిర్మాత అభిషేక్ పాఠక్ కూడా ఫహద్ గురించి స్పందిస్తూ, ప్రేక్షకులను అలరించే బలమైన కథలను తెరకెక్కించడం పనోరమా స్టూడియోస్ లక్ష్యమని చెప్పారు. ఈ కథలు చర్చించిన మొదట్లోనే ఫహద్ ఫాసిల్ ఈ పాత్రలకు సరైన న్యాయం చేయగలరని తాము భావించామన్నారు. ఆయన పాత్రల్లో పూర్తిగా లీనమయ్యే తీరు, కథల ఎంపికలో చూపే పరిపక్వత కారణంగానే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయ నటుల్లో ఒకరిగా నిలిచారని పేర్కొన్నారు. జాకబ్ బాబుతో తమ భాగస్వామ్యం మలయాళ చిత్రసీమలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని కూడా ఆయన వెల్లడించారు. ఇక దర్శకులు, ఇతర నటీనటులు, టెక్నికల్ టీంకు సంబంధించిన పూర్తి వివరాలను మరి కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
- Tags
- cinema
- Fahadh Faasil
తాజావార్తలు
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!