Site icon NTV Telugu

Fahadh Faasil: వామ్మో ఏకంగా 11 సినిమాలు లైన్లో పెట్టిన ఫహాద్ ఫాజిల్.. ఏమేంటో తెలుసా?

Fahad

Fahad

Fahadh Faasil lineup of 11 Movies list is here: దర్శకుడు ఎస్. రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తికేయ ఫహద్‌ ఫాసిల్‌ హీరోగా రెండు సినిమాలను ప్రకటించారు. ఆ సినిమాలు ఆక్సిజన్ మరియు డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఫహద్‌ ఫాసిల్‌ నటించే సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఆక్సిజన్ చిత్రానికి సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌కి శశాంక్ యాలేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కూడా కాల భ‌ర‌వ సంగీతం అందిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ ఈ ఏడాది ప్రారంభం కానుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప తర్వాత, పాన్-ఇండియన్ స్థాయిలో ఫహద్ ఫాసిల్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక పుష్ప 2 పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. అయితే ఈ సమయంలో అసలు ఫహద్‌ ఫాసిల్‌ లైనప్ గురించి వార్తలు తెరమీదకు వచ్చాయి.

Sree Vishnu: ‘ఓం భీమ్ బుష్’ పాయింట్ ని ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయలేదు: హీరో శ్రీవిష్ణు

ఇక ఆయన లైనప్ చూస్తే
1.ఆవేశం – జిత్తు మాధవన్
2.షెర్లాక్ – మహేష్ నారాయణన్ (నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ)
3.పుష్ప 2 – సుకుమార్ (తెలుగు)
4.ఓడుం కుతిర చాదుం కుతిర – అల్తాఫ్ సలీం
5.వెట్టయన్ – T.J జ్ఞానవేల్ (తమిళం)
6.మారీసన్ – సుధీష్ శంకర్ (తమిళం)
7.కరాటే చంద్రన్ – రాయ్ (అరంగేట్రం)
8.టైటిల్ ఫిక్స్ చేయని ఫిలిం – మహేష్ నారాయణన్
9.ఆక్సిజన్ – సిద్ధార్థ నాదెళ్ల (తెలుగు)
10.డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ -శశాంక్ (తెలుగు)
11.టైటిల్ ఫిక్స్ చేయని ఫిలిం – విపిన్ దాస్
ఇక ఫహద్ నిర్మిచిన ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు కార్తికేయ తీసుకున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులు కార్తికేయ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

Exit mobile version