NTV Telugu Site icon

Extra – Ordinary Man Teaser: కలిపి చదువు నాన్న.. చెత్త.. కొడుకు.. చెత్త నా కొడుకు

Extra

Extra

Extra – Ordinary Man Teaser: మాచర్ల నియోజక వర్గం సినిమా తరువాత నితిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని నితిన్ కాచుకు కూర్చున్నాడు. ఈ నేపథ్యంలోనే వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అందులో ఒకటి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన అందాల భామ శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Vishnu Priya: నా జీవితం మొత్తం ఖరాబ్ అయినా కూడా ఆ పని చేస్తున్నా..

ఇక ఈ టీజర్ లో నితిన్ .. ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నట్లు కనిపించాడు. కథ మొత్తాన్ని రివీల్ చేయకపోయినా.. నితిన్ రకరకాల గెటప్స్ లో కనిపించాడు. ” భయ్యా కథ అంటే మాములు కథ కాదు భయ్యా.. రియల్ ఇన్సిడెంట్ ను చూసి రాసుకున్న కథ ” అంటూ వాయిస్ ఓవర్ రాగానే.. నితిన్ ప్రతి సినిమాలో చేసిన గెటప్స్ ను చూపించారు. ఇక ఒక డైరెక్టర్ కు తనను పరిచయం చేస్తూ.. బాహుబలి సినిమాలో తాను కూడా నటించాను అని చెప్పడమే కాకుండా.. గ్రాఫిక్స్ లో నితిన్ బాహుబలిలో ఉన్నట్లు చూపించి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. ఇక చివర్లో తండ్రి కొడుకులు రావు రమేష్ మధ్య సంభాషణ టీజర్ కు హైలైట్ గా నిలిచింది. ” రేయ్.. నువ్వు ఒక జూనియర్ ఆర్టిస్ట్ వి.. అంటే ఒక ఎక్స్ట్రా గాడివి.. ఒక ఆర్డినరీ పర్సన్ కు ఎందుకు ఇన్ని ఎక్స్ట్రాలు” అని రావు రమేష్ అనగా.. అలా సింగిల్ సింగిల్ గా కాకుండా కలిపి చదువు నాన్న.. ఎక్స్ట్రా.. ఆర్డినరీ, ఎక్స్ట్రా ఆర్డినరీ అని అంటాడు . వెంటనే రావు రమేష్ అదే స్వాగ్ లో.. కొడుకు.. చెత్త, చెత్త నా కొడుకు అనడంతో టీజర్ పూర్తయింది. ఇక హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ ఫ్రెష్ గా కనిపిస్తుంది. టీజర్ తోనే సినిమాపై ఒక హైప్ తీసుకొచ్చారు మేకర్స్. ఇక ఈ సినిమా డిసెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమతోనైనా నితిన్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.