Site icon NTV Telugu

Extra Jabardasth: ఎక్స్ట్రా జబర్దస్త్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఏమైందంటే?

Extra Jabardasth

Extra Jabardasth

Extra Jabardasth Shelved: ‘జబర్దస్త్ షోకి తెలుగులో ఎంతో మంది ఫ్యాన్స్ వున్నారు. ఈ షో ద్వారా పదుల సంఖ్యలో కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కమెడియన్లు ఎక్కువ కావడంతో మొదట్లో గురువారం రాత్రి ‘జబర్దస్త్’గా వచ్చే షోకి అదనంగా, శుక్రవారం రాత్రి ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ అనే షో క్రియేట్ చేసి ప్రసారం చేసేవారు. అయితే ఈ ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ లవర్స్ కి టీం బాడ్ న్యూస్ చెప్పింది. అదేమంటే నెక్స్ట్ వీక్ నుంచి గురు, శుక్ర వారాల్లో ఈ షో రావడం లేదు. శుక్ర, శని వారాల్లో! ‘జబర్దస్త్’ పేరుతో షో టెలికాస్ట్ కానుంది. అయితే ఈ వారం రెగ్యులర్ టైమింగ్స్‌లోనే టెలికాస్ట్ అవుతుంది.

Pushpa2 First Single: తగ్గేదేలే.. 10 కోట్ల వ్యూస్ తో పుష్పగాడి రచ్చ మాములుగా లేదుగా..

అంటే… ఈ గురువారం (మే 30న) టీవీలో ప్రసారం అవుతుంది, అలాగే శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ వారంతో అది ముగియనుంది. ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ షో పేరు మారింది. ఇక నుంచి ‘ఎక్స్ట్రా’ అనే పదాన్ని వాడటం లేదు. ‘జబర్దస్త్’ ముందు నుంచి ఆ పేరును తొలగించారు. అయితే… షో మాత్రం ఆపక పోవడం కొంత అభిమానులకు ఊరటనిచ్చే అంశం. శుక్రవారం టెలికాస్ట్ అయ్యే ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ ఇక నుంచి ‘జబర్దస్త్’ పేరుతో శనివారం రాత్రి ప్రసారం అవుతుంది. ఐతే పేరు మాత్రమే మారిందని, కామెడీకి ఎలాంటి లోటు ఉండదని షో నిర్వాహకులు చెబుతున్నారు. ఈమేరకు ఈరోజు రిలీజ్ చేసిన ప్రోమోలో క్లారిటీ ఇచ్చారు.

Exit mobile version