Site icon NTV Telugu

SSMB 29: ఇప్పుడే ఇలా ఉంటే రాజమౌళి-మహేశ్ సినిమాకి ఇంకెలా ఉంటుందో?

Ssmb 29

Ssmb 29

ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలిసేలా చేసిన దర్శకుడు రాజమౌళి. ఒక ఇండియన్ మూవీ రీచ్ అవ్వలేదేమో అనుకున్న ప్రతి చోటుకి వెళ్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీని రాజమౌళి తెరకెక్కించిన విధానానికి వెస్ట్రన్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. వెయ్యి కోట్ల కలెక్షన్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ లాంటి గొప్ప విషయాలని కాసేపు పక్కన పెడితే ఫిల్మ్ మేకింగ్ కే స్టాండర్డ్స్ సెట్ చేసిన ‘స్టీఫెన్ స్పీల్ బర్గ్’, ‘జేమ్స్ కమరూన్’, ‘రుస్సో బ్రదర్స్’ లాంటి దర్శక దిగ్గజాలు ఒక ఇండియన్ సినిమాని చూసి, దాని గురించి ప్రపంచవేదికల పైన ప్రత్యేకంగా టైం కేటాయించి మరీ మాట్లాడుతున్నారు అంటే అది రాజమౌళి సాదించిన ఘనత. మన ఇండియన్ ఎమోషన్స్ ని బేస్ చేసుకోని, ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ పైన డిజైన్ చేసిన ఫిక్షనల్ క్యారెక్టర్స్ తో సినిమా చేస్తేనే రాజమౌళి రేంజ్ ఇలా ఉంటే… ఒక్కసారి మహేశ్ బాబు సినిమా రిలీజ్ అయితే ఇంకెలా ఉంటుందో అనే ఊహనే అద్భుతంగా ఉంది.

SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన రాజమౌళి, మహేశ్ బాబుల సినిమాపై ఇప్పటినుంచే భారి అంచనాలు ఉన్నాయి. అడ్వెంచర్ డ్రామా, గ్లోబ్ ట్రాట్టింగ్ బ్యాక్ డ్రాప్, ఫ్రాంచైజ్ గా రూపొందుతుంది, ఇండియానా జోన్స్ రేంజులో ఉంటుంది… ఇలా అవకాశం దొరికినప్పుడల్లా రాజమౌళి SSMB 29 గురించి సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో SSMB 29కి రాజమౌళి ఎలివేషన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు రాజమౌళి ఉన్న ఫేజ్ కి SSMB 29 పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీలైనన్ని ఎక్కువ భాషల్లో, వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో SSMB 29ని రిలీజ్ చెయ్యడానికి రాజమౌళి గట్టి ప్రయత్నాలు చేస్తాడు. అవతార్, అవెంజర్స్ లాంటి సినిమాలు వేల కోట్లు రాబడుతుంటే చూసి ఆశ్చర్యపోతున్నాం కదా రాజమౌళి ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం మన ఇండియన్ సినిమా ‘SSMB 29’ కూడా మినిమమ్ రెండు వేల కోట్ల నుంచి కౌంట్ మొదలుపెట్టాల్సి వస్తుంది.

Exit mobile version