శర్వానంద్ నటించిన ఎక్స్ ప్రెస్ రాజా సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు సుజీత్. తొలి సినిమానే సూపర్ హిట్. దాంతో రెండవ సినిమా ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. సుజిత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం సాహో. భారీ యాక్షన్ ఎంటెర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా యావరేజ్ ఫలితం అందుకుంది. యాక్షన్ సీక్వెన్స్ ను బాగా డైరెక్ట్ చేసాడు అనే పేరు తెచుకున్నాడు సుజీత్.
Also Read : MEGA 157 : మెగాస్టార్ సినిమా టైటిల్ చెప్పేసిన అనిల్ రావిపూడి.. అదిరిందిగా
ఇప్పడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో OG సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు సుజిత్. ఈ సినిమాపై అంచనాలు ఓ రెంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25న రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే సుజీత్ నెక్ట్స్ సినిమా నేచురల్ స్టార్ నాని హీరోగా ఉండబోతుందని ఎప్పటినుండో వార్తలు వినిపించాయి. అయితే ఇటీవల ఈ సినిమా ఆగిపోయిందని సుజిత్ ఫైనల్ వర్షన్ స్క్రిప్ట్ నానికి నచ్చలేదాని అందుకె ఈ సినిమాకు పక్కన పెట్టారని టాలీవుడ్ లో వినిపించాయి. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం సుజీత్ నెక్ట్స్ సినిమా నానితోనే ఫిక్స్. ఇందులో ఎలాంటి మార్పు లేదు. OG సినిమాను నిర్మిస్తున్న DVV ఎంటర్టైన్మెంట్స్ లోనే దానయ్య నిర్మాతగా ఈ సినిమా రాబోతుంది. అటు ది ప్యారడైజ్ ను ముగించి సుజిత్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు నాని.
