NTV Telugu Site icon

VD 12: నెక్స్ట్ లెవల్ హైపెక్కించే అప్డేట్ ?

Vijay

Vijay

బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగవంశీ, యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘వీడీ 12’ గురించి లీక్ చేసిన అప్డేట్స్ .. రౌడీ ఫ్యాన్స్‌లో రోజు రోజుకి అంచనాలు పెంచేలా ఉన్నాయి. ‘వీడీ 12’ గురించి నాగ వంశీ మాట్లాడిన ప్రతిసారి ఫ్యాన్స్‌కి హై వస్తుంది.

గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ‘జెర్సీ’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్‌లో వీడీ12 (VD12) చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగవంశీ ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు ‘ఈ సినిమా రెండు భాగాలు అనుకొని ప్లాన్ చేశాము, అలా అని కథ రెండో భాగంలో పెట్టి, మొదటి భాగం సస్పెన్స్‌తో నడిపించడం లేదు, మొదటి భాగం ఒక్కటి చూసిన సరిపోద్ది. ఇక ఈ సినిమా కంటెంట్ చూసిన తర్వాత.. మీరే షాక్ అవుతారు. ఈ మధ్యనే నేను మా బాబాయ్, ఎడిటర్ నవీన్ ఫస్ట్ ఆఫ్ చూసుకున్నాం. ‘జెర్సీ మూవీ తీసిన గౌతమేనా ఈ సినిమా తీసింది అనేలా.. వీడీ 12 అంటుంది’ అని చెప్పుకొచ్చాడు. దీంతో గౌతమ్ విజయ్ కి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇదే ఊపులో సంక్రాంతి కానుకగా వీడీ 12 టీజర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు గానీ, రౌడీ ఫ్యాన్స్ మాత్రం టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి నాగవంశీ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.

Show comments