బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, స్టార్ హీరోయిన్ అలియా భట్ ని పెళ్లి చేసుకోని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకొణె, స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ని పెళ్లి చేసుకోని ప్రశాంతంగా ఉంది. ఈ రెండు లవ్ మ్యారేజెస్ బాలీవుడ్ కి పెళ్లి కళ తెచ్చాయి. అయితే రణబీర్, దీపికాలు అలియా రణ్వీర్ లని పెళ్లి చేసుకోకముందు, ఈ ఇద్దరూ కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో మునిగి తేలారు. ఎక్కడికి వెళ్లినా చేతులు పట్టుకొని నడుస్తూ, పాపరాజ్జీకి ఫోజులు ఇస్తూ తెగ సందడి చేసారు. ఫారిన్ టూర్లు, బాడీపై టాటూ… అబ్బో ఒకటేమిటిలే దీపికా-రన్బీర్ కపూర్ లది హాటెస్ట్ పెయిర్ ఇన్ బాలీవుడ్ గా పేరు తెచ్చుకుంది. అంతగా హంగామా చేసిన దీపికా, రన్బీర్ లు ‘బచ్నా ఏ హసీనో’ సినిమా కలిసి చేసారు. ఈ సినిమా సమయంలోనే ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. అప్పటి నుంచి అయిదేళ్ల పాటు డేటింగ్ చేసి, పెళ్లి కూడా చేసుకోవాలని రెండు కుటుంబాలని ఒప్పించుకునే వరకూ వెళ్లారు. ఆ తర్వాత రన్బీర్, కత్రినాతో డేటింగ్ చేయడంతో దీపికా, రణబీర్ కి బ్రేకప్ చెప్పేసింది. అక్కడితో దీపిక-రణబీర్ కపూర్ జోడికి ఎండ్ కార్డు పడింది.
బ్రేకప్ చెప్పేసుకున్న తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించరేమో అనుకున్నారు కానీ అందరికీ షాక్ ఇస్తూ 2013లో ఏ జవానీ హై దివానీ సినిమా చేసారు. ఈ సినిమాలో దీపికా రణబీర్ మధ్య కెమిస్ట్రీ చూసి ఆడియన్స్ అసలు వీరికి బ్రేకప్ అయ్యింది అంటే నమ్మలేదు. ఆ తర్వాత మళ్లీ రెండేళ్లకే 2015లో తమాషా సినిమా చేసారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇందులోని లవ్ సీన్స్ లో దీపికా రణబీర్ జీవించేసారు. అలా కలిసున్నా విడిపోయినా ఆన్ స్క్రీన్ మాత్రం ది బెస్ట్ పెయిర్ గా పేరు తెచ్చుకోవడం దీపికా రణబీర్ కపూర్ కి మాత్రమే చెల్లింది. ఈ ఇద్దరూ కలిసి ఇంకో సినిమా ఎప్పుడు చేస్తారా అని వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1’లో దీపికా, రణబీర్ కి తల్లి పాత్రలో కనిపించి షాక్ ఇచ్చింది. లేటెస్ట్ గా దీపికా, రణబీర్ కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ జవానీ హై దివానీ సినిమా రిలీజ్ అయ్యి 10 ఇయర్స్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో దీపికా రణబీర్ కపూర్ కలిసి సందడి చేసారు. పార్టీ చేసుకోని, టీం ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో ప్రేమికులుగా విడిపోయినా స్నేహితులుగా దీపిక రణబీర్ కపూర్ కలిసే ఉన్నారు, ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Doston ke beech kabhi kuch nahi badalta, guys🥹♥️ #10YearsOfYJHD #YehJawaaniHaiDeewani #RanbirKapoor @deepikapadukone #AdityaRoyKapur @kalkikanmani #AyanMukerji pic.twitter.com/99beNXudFj
— Dharma Productions (@DharmaMovies) June 1, 2023