ప్రభాస్‌ను వెండి తెరపై శ్రీ రాముడిగా చేసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అయితే గతంలో.. ఆదిపురుష్ టీజర్‌లో గ్రాఫిక్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్‌కు డౌట్స్ పెరిగిపోయాయి. దాంతో సినిమాను ఆరు నెలలు పోస్ట్‌పోన్ చేసి అదిరిపోయే పాజిటీవిటీని సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ ఓం రౌత్. ముందుగా జై శ్రీరామ్ సాంగ్ ఆదిపురుష్ టాక్‌ను నెగెటివ్ నుంచి పాజిటివ్‌గా మార్చింది. ఇక రిలీజ్ అయిన రెండు ట్రైలర్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. సాంగ్స్‌కు కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక జూన్ 16న థియేటర్లోకి రానున్న ఈ సినిమా.. తాజాగా హిందీ వెర్షన్ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వారు క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే ఆదిపురుష్ రన్ టైం మాత్రం అనుకున్న దానికంటే కాస్త ఎక్కువగానే ఉంది. ముందు నుంచి ఆదిపురుష్ రన్‌టైమ్ రెండు గంటల యాభై ఆరు నిమిషాలుగా వినిపిస్తోంది కానీ ఫైనల్‌గా ఈ సినిమా 179 నిమిషాల రన్ టైమ్‌ను లాక్ చేసుకుందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
రెండు గంటల 59 నిమిషాలు.. అంటే ఒక నిమిషం తక్కువ మూడు గంటల నిడివితో ఆదిపురుష్ థియేటర్లోకి రాబోతోంది. మొత్తంగా ఆదిపురుష్‌ని థియేటర్లో చూడాలంటే మూడున్నర గంటలకు పైగా సమయం కేటాయించాల్సిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రతీ ఆదిపురుష్ థియేటర్లో హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించారు. అలాగే కార్తికేయ 2 నిర్మాత అభిషేక్ అగర్వాల్.. తెలంగాణలో ఏకంగా 10 వేల టికెట్స్ తన తరుపున ఉచితంగా అందించబోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, అనాధాశ్రమాలు, ఓల్డేజ్ హోమ్స్ వారికి మాత్రమే ఈ టికెట్స్ ఫ్రీగా ఇవ్వనున్నారు. ఇందుకోసం అభిషేక్ అగర్వాల్ పోస్ట్ చేసిన గూగుల్ ఫామ్ నింపి అప్లై చేసుకుంటే చాలు.. నేరుగా వారికే ఆదిపురుష్ టికెట్స్ పంపిస్తారు.