NTV Telugu Site icon

Vidhi: కంటి చూపులేని వాళ్లు కూడా థియేటర్‌లో ఎంజాయ్ చేసే ‘విధి’

Rohith Nada Vidhi

Rohith Nada Vidhi

Even blind people can watch the Vidhi film:రోహిత్ నందా, ఆనంది హీరో హీరోయిన్లుగా నో ఐడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీదుగా రంజిత్ ఎస్ నిర్మించిన తాజా చిత్రం ‘విధి’. శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ రచనా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి శ్రీనాథ్ రంగనాథన్ కెమెరామెన్‌గా పని చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేయగా ఈ మేరకు ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో నిర్మాత రంజిత్ మాట్లాడుతూ ‘‘విధి’ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోందని ఆడియెన్స్ అందరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుందని అన్నారు. ఇక హీరో రోహిత్ నందా మాట్లాడుతూ ‘‘విధి’ షూటింగ్‌, ఆ జర్నీ మాకు ఎంతో స్పెషల్ అని పేర్కొన్న ఆయన ఆడియో డిస్క్రిప్టివ్ టెక్నాలజీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని అన్నారు.

Muttiah Muralitharan: ముత్తయ్య మురళీధరన్ కి ఇష్టమైన తెలుగు హీరో ఎవరో తెలుసా?

ఆ టెక్నాలజీ వలన చూపు లేని వాళ్లు కూడా ఈ సినిమా అనుభూతి చెందగలరని అన్నారు. శ్రీ చరణ్ పాకాల అద్భుతమైన సంగీతం, ఆర్ఆర్ ఇచ్చారని విజువల్ చాలెంజెడ్ వారికి కూడా ఈ సినిమాను వేసి చూపించబోతోన్నామని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పది లక్షల మంది కంటి చూపు లేని వాళ్లున్నారని, అందులో 90 శాతం మంది ఇప్పటి దాకా థియేటర్‌కు వెళ్లి ఉండకపోవచ్చు. వాళ్లంతా థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను ఆస్వాధించవచ్చని అన్నారు. ఢిల్లీలోని సాక్ష్యం ఫౌండేషన్ ఈ యాప్ తయారు చేయడంలో సహాయం చేసిందని, యూట్యూబ్‌ ద్వారా శ్రీకాంత్, శ్రీనాథ్ పరిచయం అయ్యారని అన్నారు. అలా మా విధి ప్రయాణం ప్రారంభం అయిందని పేర్కొన్న ఆయన ఆనందితో కంఫర్టబుల్‌గా పని చేశానని, మా సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

Show comments