Site icon NTV Telugu

Arjun Ambati: నిర్మాత బాగుంటేనే ఏదైనా!

Evare

Evare

అనిశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట కళ్యాణ్ మండవిల్లి సమర్పణలో శిరీష మండవిల్లి నిర్మాణంలో ‘ఎవరే’ ప్రైవేట్ ఆల్బమ్‌ని ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఆల్బమ్‌కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతల్ని ఆనంద్ నిర్వర్తించారు. ఎస్ ఎస్ వర్దన్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బమ్‌లో వెచలపు కృష్ణ, రిద్ది అనామిక చరణ్ నటించారు. ఈ పాటను మే ఒకటో తేదీన క్రేజీ ఎన్ క్యాచీ యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు ఈ పాటకు సంబంధించిన రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్జున్ అంబటి, సింగర్ సాకేత్, రాంబాబు గోసాల ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ ఈవెంట్‌లో.. అర్జున్ అంబటి మాట్లాడుతూ* .. ‘‘ఎవరే’ టీంకు ఆల్ ది బెస్ట్. నిర్మాత బాగుంటేనే మళ్లీ ఇంకో పాటను గానీ, సినిమాను గానీ తీస్తారు. పవన్ కళ్యాణ్ పాట పాడుతూ ఉంటే నేను పర్పామ్ చేశాను. పవన్ కళ్యాణ్ సింగర్‌గా ఇంకా మంచి స్టేజ్‌కి వెళ్లాలని కోరుకుంటున్నాను. వర్దన్ మ్యూజిక్ బాగుంది. కృష్ణ, రిద్ధి జంట బాగుంది. పక్కింటి అబ్బాయిలా కృష్ణ కనిపిస్తున్నారు. ‘ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. హీరో వేచలపు కృష్ణ మాట్లాడుతూ* .. ‘‘ఎవరే’ నాకు ఎంతో ప్రత్యేకం. ఈ రోజు నా కోసం వైజాగ్ నుంచి మా అమ్మగారు వచ్చారు. ఆనంద్, వర్దన్ వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను. శిరీష మండవిల్లి గారి సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. ఈ పాట మే 1న క్రేజీ ఎన్ క్యాచీ యూట్యూబ్‌లో రిలీజ్ కాబోతోంది. అందరూ మా పాటను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Exit mobile version