దీపావళి కానుకగా మార్వెల్ స్టూడియోస్ నుండి మరో మూవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం ‘షేంగ్ – ఛీ అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ మూవీ రిలీజ్ అయ్యింది. మార్వెల్ స్టూడియోస్ నుండి వచ్చిన ఈ సూపర్ హీరో మూవీ యాక్షన్ ప్రియులను బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ యేడాది మార్వెల్ స్టూడియోస్ మరో ఆసక్తికరమైన సినిమాను జనం ముందు తీసుకురాబోతోంది. పలువురు హాలీవుడ్ టాప్ స్టార్స్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఇటర్నల్స్’ను దీపావళి కానుకగా నవంబర్ 5న విడుదల చేయబోతోంది. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ క్లోయూ జావ్ రూపొందించిన ఈ సూపర్ హీరోస్ మూవీలో రిచర్డ్ మాడెన్, గెమ్మ చాన్, కుమాయిల్ నంజియాని, లారెన్ రిడ్ లాఫ్, బ్రియాన్ టైరీ హెన్రీ, సల్మా హయెక్, ఏంజెలీనా జోలీ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు.
Read Also : సెప్టెంబర్ 10 నుంచి “ఖిలాడీ” మ్యూజిక్ ఫెస్టివల్
Also Read
ఈ సినిమాను నవంబర్ 5న ఇంగ్లీష్ తో పాటు హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. మానవ జాతి పురాతన శత్రువు డెవియెంట్స్ ను ఎదుర్కొనడానికి అమరవీరులంతా కలిసి ఎలాంటి పోరాటం చేశారనే పురాణగాథ ఆధారంగా ‘ఇటర్నల్స్’ను మార్వెల్ స్టూడియోస్ నిర్మించింది. నిజానికి ఈ సినిమా గత యేడాది నవంబర్ 6న విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ యేడాది ఫిబ్రవరికి, ఆ తర్వాత మే నెలకు మారి… ఇప్పుడు ఫైనల్ గా నవంబర్ 5న రిలీజ్ అవుతోంది. ఇటీవల వచ్చిన ‘బ్లాక్ విడో, షేంగ్ ఛీ’ చిత్రాలకు థియేటర్లలో ఆదరణ బాగానే ఉండటంతో ఈ సినిమా విజయంపైనా దర్శక నిర్మాతలు భారీ ఆశలు పెట్టుకున్నారు.
తాజావార్తలు
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!