సెప్టెంబర్ 10 నుంచి “ఖిలాడీ” మ్యూజిక్ ఫెస్టివల్

మాస్ మహారాజ రవితేజ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై నిర్మించారు. రవి తేజ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్నీయును ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను 2021 మే 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అన్ని సినిమాల్లాగే “ఖిలాడీ” వాయిదా పడింది. ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు.

Read also : ఆకట్టుకుంటున్న “మహా సముద్రం” మెలోడీ సాంగ్

సెప్టెంబర్ 10 నుంచి “ఖిలాడీ” మ్యూజిక్ ఫెస్టివల్ పూర్తవుతుంది అంటూ పోస్టర్ ను విడుదల చేశారు. సెప్టెంబర్ 10న వినాయక చవితి. ఈ సందర్భంగా “ఖిలాడీ” ఇలా వేడుకలు జరుపుకుంటుందన్న మాట. ఇక ఈ సినిమా నుంచి “ఇష్టం” అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ను వినాయక చవితి రోజున విడుదలవుతుంది. హీరోహీరోయిన్ల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ కు సంబంధించి స్పెషల్ గా ఓ చిన్న వీడియోను కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో డింపుల్ హయాతి అందానికి రవితేజ ఫిదా కావడాన్ని చూపించారు. ఈ అప్డేట్ తో రవితేజ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇంకా ఫస్ట్ సింగల్ కు నాల్రోజులే ఉండడంతో అప్పుడే కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు.

Related Articles

Latest Articles

-Advertisement-