Site icon NTV Telugu

బాలయ్య నామస్మరణలో గ్రామం… ఆరుబయట “అఖండ”…!!

akhanda

akhanda

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన “అఖండ” చిత్రం జోరు ఇంకా తగ్గనేలేదు. సినిమా విడుదలై 50 రోజులు పూర్తయినా ప్రేక్షకుల నుంచి ఏమాత్రం ఆదరణ తగ్గలేదు అనిపించేలా తాజాగా జరిగిన ఓ సంఘటన సినీ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిజిటల్ ప్రీమియర్ అయ్యాక కూడా ‘అఖండ’ ఆవేశానికి అడ్డుకట్ట పడకపోవడం విశేషం. ఓటిటిలో విడుదలైన 24 గంటల్లోనే, రికార్డు స్థాయిలో ప్రేక్షకులు యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వీక్షించారు.

Read Also : బాలయ్య నామస్మరణలో గ్రామం… ఆరుబయట “అఖండ”…!!

ఇప్పుడు ఆశ్చర్యకరంగా పాత రోజుల్లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామం మొత్తం బహిరంగ మైదానంలో ‘అఖండ’ను వీక్షించింది. ఈ విషయం టీ-టౌన్‌లో హాట్ న్యూస్‌గా మారింది. అంతేకాదు బాలయ్య స్టామినాను మరోసారి నిరూపించింది. దానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమా కేరళలోనూ దుమ్ము రేపుతోంది. హాట్ స్టార్ లో వస్తున్న మలయాళ వెర్షన్ కు కూడా విశేషమైన స్పందన రావడమే కాకుండా, మలయాళ ఫ్యాన్స్ పేజీలు, ట్రోల్స్ పేజీలు కూడా ‘అఖండ’తో నిండిపోతున్నాయి.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సెన్సేషనల్ హిట్ సినిమా ఇప్పటికే ఉన్న అనేక ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, జగపతి బాబు తదితరులు కీలకపాత్రను పోషించగా, థమన్ అందించిన సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది.

Exit mobile version