NTV Telugu Site icon

Amigos: ‘ఎన్నో రాత్రులు’ వచ్చేది ఈరోజు సాయంత్రమే…

Amigos

Amigos

నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ తర్వాత ‘అమిగోస్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీలో బాలయ్య సూపర్ హిట్ పాటని రీమిక్స్ చేశారు. బాలకృష్ణ, దివ్యభారతి హీరో హీరోయిన్లుగా నటించిన ధర్మక్షేత్రం సినిమాలో “ఎన్నో రాత్రులు వస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ” అనే సాంగ్ అప్పట్లో ఒక సెన్సేషన్. ఇళయరాజా కంపోజ్ చేసిన ట్యూన్ కి తెలుగు సాహిత్య లెజెండ్స్ అయిన వేటూరి గారు, సిరి వెన్నెల సీతారామశాస్త్రి గారు కలిసి లిరిక్స్ రాశారు. బాలు, జానకి, మనో, చిత్ర లాంటి బ్యూటిఫుల్ సింగర్స్ కలిసి “ఎన్నో రాత్రులు వస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ” సాంగ్ ని స్పెషల్ గా మార్చారు.

Read Also: Amigos: ఇంతకీ ఈ ముగ్గురూ ఎక్కడ కలుస్తారు?

నైట్ ఎఫెక్ట్ లో కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని ఇప్పుడు కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నాడు. థియేటర్స్ లో ఈ సాంగ్ ప్లే అయితే ఆడియన్స్ కూడా హమ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఇళయరాజా, బాలసుబ్రమణ్యం లాంటి లెజెండ్స్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ని యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఘిబ్రాన్ మ్యాచ్ చెయ్యగలడా అనేది ఆలోచించాల్సిన విషయమే. ధర్మక్షేత్రం మ్యాజిక్ ని అమిగోస్ చిత్ర యూనిట్ రీక్రియేట్ చెయ్యగలిగారో లేదో తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 10 వరకూ వెయిట్ చెయ్యాల్సిన అవసరం లేదు. ఈరోజు సాయంత్రం ఈ “ఎన్నో రాత్రులు వస్తాయి గానీ” ఫుల్ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చెయ్యనున్నారు. ఈరోజు సాయంత్రం 5:09 నిమిషాలకి ఈ క్లాసిక్ సాంగ్ ని చూసి ఎంజాయ్ చెయ్యండి. నిజానికి ఈ పాటని ముందే రిలీజ్ చెయ్యాల్సి ఉంది కానీ తారక రత్న క్రిటికల్ కండిషన్ లో హాస్పిటల్ లో ఉండడంతో చిత్ర యూనిట్ పాటని రిలీజ్ చెయ్యకుండా వాయిదా వేశారు.

Read Also: Amigos: ఇదెక్కడి మేకోవార్ రా మావా… కళ్యాణ్ రామ్ ని గుర్తు పట్టడం కూడా కష్టమే

Show comments