Enforcement Directorate issues notice to Shah Rukh Khan’s wife Gauri Khan: షారుఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న డంకీ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా డిసెంబర్ 21న థియేటర్లలోకి రానుంది. ఇదిలా ఉంటే సినిమా విడుదల కాకముందే షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పై ఈడీ పట్టు బిగించడం హాట్ టాపిక్ అయింది. అయితే ఇది సినిమాల విషయం కాదండోయ్ అసలు ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం? నిజానికి, గౌరీ ఖాన్ లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ తులసియానీ గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్. అయితే అదే గ్రోప్ ఇప్పుడు ఇన్వెస్టర్లు, బ్యాంకుల నుంచి సుమారు రూ.30 కోట్ల మేర అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
Salaar 1AM Shows: ప్రభాస్ ఫాన్స్ కి బంపర్ న్యూస్.. ఈ 20 థియేటర్లలో అర్ధరాత్రి ఒంటిగంటకే సలార్!
దీంతో గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్ షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కూడా ఈడీ స్కానర్ కిందకు రానున్నారు. అయితే దీనిపై గౌరీ ఖాన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందున, ఆమెను అనేక కోణాల్లో ప్రశ్నించవచ్చు. ఆ కంపెనీతో గౌరీకి ఉన్న కాంట్రాక్ట్ ఎలా ఉంది? అలాగే ఆమెకు ఎంత డబ్బు చెల్లించారు లాంటివి విషయాలు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది గౌరీ ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుదారు ఈ కంపెనీపై నివేదికను దాఖలు చేయడమే కాకుండా, సీఎండీ మరియు డైరెక్టర్‌తో పాటు గౌరీ ఖాన్‌పై మోసం కేసు వేశారు.గౌరీ ఖాన్ ఇటీవల ఆమె కుమారుడు అబ్రామ్ ఖాన్ వార్షిక కార్యక్రమంలో కనిపించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు, షారుఖ్‌తో కలిసి ఈవెంట్‌లలో ఆమె తరచుగా కనిపిస్తుంది.