Site icon NTV Telugu

Krishna Vrinda Vihari: ‘ఏముందిరా’ అంటూ హీరోయిన్ వెంట పడుతున్న నాగశౌర్య

Krishna

Krishna

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల ఈ హీరో నటించిన ‘వరుడు కావలెను’ డీసెంట్ హిట్ ను అందుకున్నా కలెక్షన్ల పరంగా కొద్దిగా వెనకంజ వేసిన విషయం విదితమే. ఇక దీంతో ఈసారి భారీ హిట్ అందుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే నాగ శౌర్య నటిస్తున్న చిత్రం  “కృష్ణ వ్రింద విహారి”. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా..  శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఉషా మల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ఏముందిరా.. ఈ అద్భుతాన్ని చూడు’ అంటూ సాగే ఈ పాట సంగీత అభిమానులను అలరిస్తోంది. మహతి స్వర సాగర్ స్వరపరిచిన ఈ పెప్పీ డ్యాన్స్ నంబర్ ను సింగర్ హరిచరణ్ ఆలపించారు. ఇక వీడియో లో నాగ శౌర్య లుక్ ఆకట్టుకొంటుంది. పైన కోటు, కింద పంచె, నుదుటిన  నామంతో ఎంతో అందంగా కనిపించాడు. ఈ చిత్రంలో శౌర్య బ్రాహ్మణ యువకుడిగా కనిపించాడు. మోడ్రన్ డ్రెస్ లో ఉన్న హీరోయిన్ ను ఒక్కసారిగా సాంప్రదాయ దుస్తుల్లో చూసి ఆమెను  వర్ణిస్తున్నట్లు గీత రచయిత హర్ష సాహిత్యం అందించిన తీరు బావుంది. ఇక ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించింది. ఇకపోతే  మే 20న ఈ చిత్రం విడుదల కానుంది. మరి ఈ చిత్రంతో నాగ శౌర్య హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.

Exit mobile version