Emraan Hashmi: ఐశ్వర్యపై చేసిన కామెంట్ తప్పే.. నిజం ఒప్పుకున్న బాలీవుడ్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emraan Hashmi: దాదాపు పదేళ్ల క్రితం ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను “ప్లాస్టిక్” అని వ్యాఖ్యానించిన ఇమ్రాన్, ఇప్పుడు ఆ మాటలపై తనకు పశ్చాత్తాపం ఉందని అంగీకరించారు. అంతేకాదు, ఆ వ్యాఖ్యతో ఆమె మనస్తాపానికి గురై ఉంటే వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2014లో కరణ్ జోహార్ నిర్వహించిన ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ హష్మీ, ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో భాగంగా ఐశ్వర్య రాయ్ గురించి “ప్లాస్టిక్” అనే పదాన్ని ఉపయోగించారు. ఆ సమయంలో అది షో ఫార్మాట్లో భాగంగా చెప్పిన సరదా మాటగా కనిపించినప్పటికీ, తర్వాత అది పెద్ద వివాదంగా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ వ్యాఖ్యపై చాలాకాలం పాటు విమర్శలు వ్యక్తమయ్యాయి.
తాజాగా జర్నలిస్ట్ సౌరభ్ ద్వివేదికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ప్రశ్నించగా, ఇమ్రాన్ ఎలాంటి సాకులు చెప్పకుండా నేరుగా స్పందించారు. ఆ వ్యాఖ్య చేసినందుకు తనకు నిజంగానే పశ్చాత్తాపం ఉందని చెప్పారు. ఐశ్వర్య రాయ్‌ను తాను ఇప్పటివరకు వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని, ఆమెతో మాట్లాడే అవకాశం కూడా రాలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా ఐశ్వర్యపై తనకున్న అభిమానాన్ని కూడా ఇమ్రాన్ గుర్తు చేసుకున్నారు. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ చిత్రం చూసిన తర్వాత ఆమెకు తాను పెద్ద అభిమానిగా మారిపోయానని చెప్పారు. ఒక్కసారైనా ఆమెను చూడాలని ఆమె వ్యాన్ బయట దాదాపు మూడు గంటల పాటు ఎదురుచూసిన సందర్భం కూడా ఉందని గుర్తుచేసుకున్నారు. ఈ విషయం ప్రస్తావిస్తూ, తాను ఎప్పుడూ ఆమెను గౌరవంగానే చూసానని వివరించారు.
Also Read
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
- Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
ఇప్పుడు అవకాశం వస్తే ఐశ్వర్య రాయ్‌ను తప్పకుండా కలవాలని ఉందని ఇమ్రాన్ తెలిపారు. ఒకవేళ తన వ్యాఖ్య ఆమెను బాధపెట్టి ఉంటే ఎలాంటి సంకోచం లేకుండా క్షమాపణ చెబుతానని స్పష్టం చేశారు. తన మాటల వల్ల ఆమె మనస్తాపానికి గురై ఉంటే దానికి బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇమ్రాన్ హష్మీ తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారాయి. గతంలో చేసిన వ్యాఖ్యను సమర్థించుకునే ప్రయత్నం చేయకుండా, షో ఫార్మాట్‌ను కారణంగా చూపకుండా, అది తప్పేనని ఒప్పుకుని క్షమాపణ చెప్పేందుకు ముందుకు రావడం చాలా మంది నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.
- Tags
- cinema
- Emraan Hashmi
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!