భారత్- పాక్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్‌లో లోని ఉగ్ర శిబిరాలపై దళాల దాడులు చేసింది. పీఓకేలో ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసి మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత ఆర్మీ. పాకిస్తాన్‌పై భారత ఆర్మీ చేపట్టిన చర్యల పట్ల సర్వత్రా అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఇండియాన్ ఆర్మీకి అభినందలు తెలుపుతూ పోస్ట్ లు చేస్తున్నారు నెటిజన్స్. అలాగే పలువురు సినీ తారలు సైతం భారత ఆర్మీకి సెల్యూట్ అంటూ పోస్ట్ లు చేస్తున్నారు. ఎవరెవరు ఏమన్నారంటే..
JR. NTR : మన భారత సైన్యం యొక్క భద్రత మరియు బలం కోసం ప్రార్థిస్తున్నాను.. జై హింద్
పవన్ కళ్యాణ్ : దశాబ్దాలుగా సహనం.. సహనం! మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతం కి “ఆపరేషన్ సింధూర్” తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని శ్రీ గారికి కృతజ్ఞతలు… మీ వెన్నంటే మేము. జైహింద్!
రజనీకాంత్ : యోధల పోరాటం ప్రారంభమయింది.. మిషన్ పూర్తయ్యే వరకు ఈ పోరాటం ఆగదు! మొత్తం దేశం మీతో ఉంది.
కళ్యాణ్ రామ్ : మన రక్షణ దళాలకు మరింత బలం మరియు శక్తి ఇద్దాం. ఆపరేషన్ సిందూర్ పిరికి పహల్గామ్ టెర్రర్ దాడులకు బలమైన సమాధానం. గౌరవించండి. సంకల్పించండి. జ్ఞాపకం చేసుకోండి.
అల్లు అర్జున్ : ఆపరేషన్ సింధూర్ తో న్యాయం గెలవాలి. జై హింద్
మెగాస్టార్ : ఆపరేషన్ సింధూర్ స్టార్ట్.. జై హింద్
వరుణ్ తేజ్ : ఉగ్రవాదాన్ని క్షమించేది లేదు.
విశ్వక్ సేన్ : “కొన్నిసార్లు కష్టతరమైన మిషన్లు క్లోజ్ డోర్స్ వెనుక జరుగుతాయి. షార్ప్ గా ఉండండి, ఫోకస్ గా ఉండండి. ప్రతి కదలిక ముఖ్యం. జై హింద్
ఇంద్ర రామ్ : భారత ఆర్మీకి సెల్యూట్.. జై హింద్
